ఇటీవల కాలంలో మనిషి ఆలోచనలు మారుతున్నాయి. డబ్బు, ఆస్తులు సంపాదన మీద కంటే.. మానసిక ఆనందంపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అందులో భాగంగానే చాలా మంది దేశ, విదేశాలు తిరిగి అక్కడి సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా మటుకు ఈ టూర్లను కార్లలోనో, లేదా బైక్ లపైనో చేస్తుంటారు ఔత్సాహికులు. ఇక విదేశీ టూర్లు అయితే విమానయానం కచ్చితం. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ జంట సైకిల్ పై ఆల్ ఇండియా కపుల్ టూర్ చేస్తూ.. అందరిని ఆశ్యర్య పరుస్తున్నారు. ఈ భార్య భర్తలు సైకిల్ పై చెక్కర్లు కొడుతూ.. ఇండియాలోని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో ఫైనాన్స్ వాపారం చేసుకుంటూ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు ప్రదీప్ దేవనాథ్. అతడికి సంగీత దేవనాథ్ అనే భార్య కూడా ఉంది. అయితే ప్రదీప్ కు ఈ రోటీన్ లైఫ్ బోర్ కొట్టినట్లుంది. అందుకే జీవితాన్ని మరింతగా ఆహ్లదకరంగా మార్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే పనిగా ఇండియా మెుత్తాన్ని చుట్టేయాలని ఇండియా టూర్ ప్రారంభించాడు. ఇందులో విశేషం ఏముంది? ఇది అందరు చేసేదేగా అని మీరు అనుకోవచ్చు. కానీ వారు ఈ ఇండియా టూర్ ను చేస్తోంది ఏ కార్లోనో, బస్ లోనో కాదు.. చిన్న సైకిల్ పై. అవును భార్య భర్తలు ఇద్దరు కలిసి సైకిల్ పై సరదగా ఇండియాలోని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు.
గతేడాది అక్టోబర్ 27న ఈ టూర్ ను బెంగాల్ నుంచి ప్రారంభించారు. ఈ టూర్ కు ‘ఆల్ ఇండియా కపుల్ టూర్’ అని నామకరణం కూడా చేశారు. ఆయా రాష్ట్రాలను సందర్శిస్తూ.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను, పర్యాటక ప్రదేశాలను, దేవాలయాలను సందర్శిస్తూ.. యానాం చేరుకున్నారు. ఇక వారి టూర్ లో భాగంగా వారు సందర్శిస్తున్న ప్రాంతాల విజువల్స్ ను తమ సెల్ ఫోన్ లో బంధిస్తు.. ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా యానాం చేరుకున్న ఈ జంటను స్థానికులు ప్రశ్నించగా..”గతేడాది అక్టోబర్ 27న ఈ సైకిల్ యాత్రను స్టార్ట్ చేశాం. ఇక మేము ప్రతీ రోజు తిరిగే ప్రదేశాల్లో విశిష్టతలను తెలుసుకుంటున్నాం. ఆలయాల్లో, పర్యాటక ప్రదేశాల్లో బస చేస్తూ.. మా ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఇక పర్యావరణం కాలుష్యం కాకూడదనే మా యాత్రను సైకిల్ పై ప్లాన్ చేసుకున్నాం. చిన్న ప్రాంతమైనప్పటికీ యానాం అభివృద్ధి చెందిన తీరు అమోఘం” అని చెప్పుకొచ్చారు ఈ బెంగాల్ జంట.
ఇక ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘నువ్వు గ్రేట్ బ్రో భార్యను సైకిల్ పై కూర్చోబెట్టుకుని తొక్కుతున్నావ్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తే.. మరికొందరేమో.. ఆల్ ఇండియా కపుల్ టూర్ వేసిన నీ గట్స్ కు హ్యాట్సాఫ్ బ్రదర్ అంటూ రాసుకొచ్చారు. నీలాంటి మంచి భర్త మాకూ దొరకాలని కొందరు అమ్మాయిలు సరదాగా కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి టూర్లు వేసి ఆనందానికి ఆనందం.. డబ్బుకు డబ్బు సంపాదించోచ్చు అని ఇంకోందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి సైకిల్ పై ఆల్ ఇండియా టూర్ వేసిన ఈ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.