పెళ్లి అనేతి ప్రతి ఒక్కరికీ జీవితంలో మరుపురాని ఓ మధుర ఘట్టం గా భావిస్తుంటారు. ఈ మద్య ప్రీ వెడ్డింగ్ మొదలు వెడ్డింగ్ పూర్తయ్యే వరకు తమ స్థాయికి తగ్గట్టుగా ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. అప్పుడప్పుడు వివాహ వేడుకలో జరిగే ఫన్నీ మూవ్ మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం అంటారు. వేద మంత్రాల సాక్షిగా.. ఆకాశమంత పెళ్లి పందిరి వేసి.. బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ఈ మద్య ప్రీ వెడ్డింగ్ మొదలు వెడ్డింగ్ వరకు తమ పెళ్లి ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకునే విధంగా వెరైటీగా జరుపుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ జంట జోరు వానలో తడుస్తూ మరీ పెళ్లి చేసుకున్నారు. గొడుగు పట్టుకుని వధూవరులు ఏడడుగులు వేశారు. వివరాల్లోకి వెళితే..
పెళ్లి అనేది జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం. పెద్దలు నిశ్చయించిన ముహూర్తంలో పెళ్లి తంతు ముగించేందుకు పూజారులు ఎంతో హడావుడి చేస్తుంటారు. పెళ్లి వేడుకను అట్టహాసంగా జరపడానికి అన్నీ ముస్తాబు చేస్తారు. కానీ అంతలోనే జోరున వర్షం పడితే వధూవరుల సహా అందరూ తలదాచుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఓ జంట మాత్రం ఏంత వర్షం వచ్చినా.. పెట్టిన ముహూర్తానికి ఏడడుగులు వేయాల్సిందే అన్న పట్టుదలతో గొడగు పట్టుకొని మనీ తంతు పూర్తి చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో చత్తీస్‌గఢ్‌లోని కొన్ని జిల్లాల్లో కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో ఓ కుటుంబలో వివాహ వేడుక జరుగుతుంది. ఇంటి ముందు పందిరి వేసి అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి జరిగి ఏడడుగులు వేసే సమయంలో హఠాత్తుగా వర్షం కురవడం మొదలైంది.
భారీగా వర్షం రావడంతో పందిరి మొత్తం తడిసిపోయి మండపంలోని నీళ్లు రావడం మొదలైంది. భారీగా వర్షం రావడంతో పూజారి, బంధు మిత్రులు తడవకుండా ఇంట్లోకి పరుగులు తీశారు. ఈక్రమంలో పూజారి వర్షంలో తడవకుండా వరండాలో కూర్చొని మంత్రాలు చదువుతుంటే.. నూతన వధూవరులు ఏడడుగులు వేశారు. వధువు ముందు నడుస్తుండగా.. వరుడు గొడుగు పట్టుకొని ఆమెతో ఏడడుగులు నడిచాడు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు ఈ తంతు చూస్తూ ఆశీర్వదించడమే కాదు.. చప్పట్లుకొడుతూ కేరింతలు కొట్టారు. మరికొంత మంది వర్షంలో ఏంటీరా నాయనా ఈ తిప్పలు అంటూ ఆటపట్టించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.