భారతదేశం ఎన్నో రకాల ఖనిజ సంపదలకు నిలయం. ఈ నేలల్లో బంగారు, వజ్రాలు దాగి ఉన్నాయి. అలా భూగర్భంలోనే కాకుండా ఉపరితలంపై కూడా అప్పుడుప్పుడు బంగారు నాణేలు, వజ్రాలు దొరికాయి. తాజాగా ఓ గ్రామం సమీపంలోని నది ఒడ్డున అద్భుతం జరిగింది. దీంతో స్థానికులు నది ఒడ్డుకు పొటెత్తుతున్నారు.
భారతదేశం ఎన్నో రకాల ఖనిజ సంపదలకు నిలయం. ఈ నేలల్లో బంగారు, వజ్రాలు దాగి ఉన్నాయి. అలా భూగర్భంలోనే కాకుండా ఉపరితలంపై కూడా అప్పుడప్పుడు బంగారు నాణేలు, వజ్రాలు దొరికాయి. బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో బంగారు నాణేలు, వెండినాణేలు దొరికిన ఘటనలు చాలానే జరిగాయి. అలానే ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో కూడా బంగారు నాణేలు తరచు దొరుకుతుంటాయి. అలానే అరుదుగా వజ్రాలు సైతం ఈ నేలపై దొరికాయి. దీంతో తరచూ వర్షాకాలం సమయంలో ఆ ప్రాంత ప్రజలు పొలాల్లోకి వెళ్లి వజ్రాల వేట సాగించే వారు. తాజాగా ఓ గ్రామానికి చెందిన వారు కూడా నది ఒడ్డుకు భారీగా క్యూ కడుతున్నారు. అక్కడ బంగారం ఉన్నట్లు తెలియడంతో గ్రామస్థులు జల్లెడపడుతున్నారు. మరి.. అది ఏ ప్రాంతం, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ..ముఖ్యంగా కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో వర్షం పడితే చాలు.. అక్కడి రైతులు పొలాల్లో వేట ప్రారంభిస్తారు. పలు గ్రామాల్లోని ప్రజలు బంగారం కోసం పొలాల్లోను జల్లెడ పడుతుంటారు. వర్షాలకు ఇక్కడి ప్రాంతంలో బంగారు, వెండి నాణేలు పొలాల్లో బయటపడేవి. ఇప్పటికే చాలా మందికి బంగారు నాణేలు దొరికాయి. అందుకే ఈ కర్నూలులోని కొన్ని ప్రాంతాల వారు వర్షం పడితే.. చాలు పొల్లాలోకి పొటెత్తుతారు. తాజాగా పశ్చిమ బంగాల్ లోని బీర్భూమ్ ప్రాంతంలోని బన్ స్లోయ్ నది ఒడ్డుకు కూడా స్థానికులు గుంపులుగా చేరారు.
ఆ నది ఒడ్డున బంగారం ఉన్నట్లు తెలుస్తోంది.. వారం క్రితం ఈ నది ఒడ్డుకు స్నానంకి వెళ్లిన వారికి బంగారం దొరికింది. ఆ విషయం కాస్తా సమీపంలోని గ్రామస్తులకు తెలిసింది. దీంతో గ్రామస్తులు సైతం బంగారం కోసం నది వద్దకు వెళ్తున్నారు. నదీ ఒడ్డున కొందరు మట్టిని తవ్వుతుండగా బంగారం దొరికింది. ఇక ఈ దొరికిన బంగారం గురించి రాబిడాస్ అనే గ్రామానికి చెందిన మీరా అనే మహిళ పలు విషయాలు తెలిపారు. “ఈ నది ఒడ్డున కొందరికి బంగారం దొరికింది. అది చాలా చిన్నగా.. పాత పైసా నాణేం లాగా ఉంది. అంతే కాక కొన్ని పురాతన అక్షరాలు, గుర్తులు ఉన్నాయి” అని వారు తెలిపారు.
అంతేకాదు ఈ బన్ స్లోయ్ నది ఒడ్డున మరిన్ని బంగారం నగలు నాణేలు దొరుకుతాయని వ్యక్తం చేశారు. నది ఒడ్డున దొరికిన బంగారు నాణేలు చక్రాల రూపంలో ఉన్నాయని, ఇది పూర్వకాలంలో మన దేశాన్ని పాలించిన రాజులకు చెందినదని మరికొందరు గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం తమకు ఏమైన బంగారం దొరుకుతుందేమోననే నమ్మకంతో గ్రామస్తులు నది ఒడ్డుకు పొటెత్తున్నారు. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.