సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఆడపిల్లలపై రోజు రోజుకు అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయి. మానవత్వం మరిచి ఆడపిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను వాడుకుని ఆ తరువాత పాశవికంగా హత్యలు చేయడం వంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిని ఊరి పెద్దలు మానసికంగా హింసిచిన ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది.

నాగరిక సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నప్పటికి మనుషుల మధ్య ప్రేమానురాగాలు కొరవడుతున్నాయి. ఈ క్రమంలో ఓ బాలిక పెద్దలు కుదిర్చిన పెళ్లికి నిరాకరించి ఇళ్లు విడిచి వెళ్లినందుకు ఆ ఊరు గ్రామ పెద్దలు ఆ అమ్మాయి పట్ల మానవత్వం మరిచి శిక్షించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన జార్ఖండ్ లోని పలాము జిల్లాలో పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోగిడిహ్ గ్రామంలో చోటు చేసుకుంది. తుగ్లకీ శాసనం పేరుతో ఓ యువతిని గుండు గీయించి, అనంతరం ఆ బాలికపై చెప్పుల దండ వేసి, దాడి చేస్తూ ఊరేగించారు. సమాచారం అందుకున్న పటాన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని రక్షించారు. దాడిలో గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం మేదిని రాయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఘటనతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటి.. వారు అలా ఎందుకు శిక్షించారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
యువతి వివాహాన్నీ ఆమె కుటుంబ సభ్యులు పోయిన నెల ఏప్రిల్ 19న నిశ్చయించారు. వివాహం జరిగే రోజు వరుడు తన బంధువులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా అమ్మాయి ఇంటికి వచ్చారు. ఏమైందో ఏమోగాని ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించింది. ఇళ్లు విడిచి పారిపోయింది. ఈ ఘటన జరిగిన సుమారు 20 రోజుల తరువాత పారిపోయిన అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చింది. ఈ విషయమై గ్రామంలో గ్రామస్తులు పంచాయితీ పెట్టారు. ఆ యువతి శీలాన్ని శంకిస్తూ.. ఊరిలోని మిగతా అమ్మాయిలు ఇలా చేయకూడదంటే తగిన శిక్ష వేయాలని భావించారు. ఆ అమ్మాయి జుట్టు గీసి గుండు చేశారు. చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. అనంతరం ఆ యువతిని గ్రామం నుంచి వెలివేశారు. ఇదిలా ఉండగా యువతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. తన పట్ల జరిగిన అమానవీయ సంఘటనలో గ్రామస్తులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్రమేయం ఉందని పేర్కొంది. పోలీసులు ఈ ఘటనలో పాల్గొన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.