బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. చాలా నెమ్మదిగా ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 సమయానికి కేవలం 58.18 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ గ్రామస్థులు ఏకంగా ఈవీఎం మిషన్లను ధ్వంసం చేశారు.
బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. చాలా నెమ్మదిగా ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 సమయానికి కేవలం 58.18 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సినీ, రాజకీయ ప్రముఖులందరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతం జరుగుతున్నాయి. అయితే అక్కడకక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా విజయపుర జిల్లాలోని ఓ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల ఈవీఎం మిషన్లను గ్రామస్థులు ధ్వంసం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ్ల కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకాలోని మసబినళ గ్రామంలోని స్థానికులు ఈవీఎం మిషన్లు, వీవీప్యాట్ యంత్రాలను ధ్వంసం చేశారు. అంతేకాక పోలింగ్ అధికారుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అధికారులు వీవీప్యాట్‌లు, ఈవీఎంలు మారుస్తున్నారనే పుకార్లు రావడంతో ఆగ్రహించిన కొందరు గ్రామస్థులు ఈ విధ్వంసం సృష్టించారు. పోలింగ్ స్టేషన్ లో ఉన్న మిషన్లను కొందరు గ్రామస్థులు బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులను కూడా స్థానికులు చితకబాదారు. అలానే వారివద్ద ఉన్న ఈవీఎంలను లాక్కుని గ్రామస్థులు ధ్వంసం చేశారు. అలానే ఎన్నికల సిబ్బంది కారును పల్టీ కొట్టించి ధ్వంసం చేశారు.
ఈ దాడిలో వీవీఎమ్ ప్యాట్ మిషన్లు గ్రామస్థులు నుజ్జు నుజ్జు చేశారు. దీంతో మసనబిలి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇలానే బెంగళూరు పట్టణంలో పద్మనాభనగర్ నియోజకవర్గంలో ఓ పొలింగ్ బూత్ లో కొందరు యువకలు రచ్చ రచ్చ చేశారు. కర్రలతో తమ ప్రత్యర్థి పార్టీ వారిపై దాడి చేశారు. ఈ ఘటనతో ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. మరోవైపు బళ్లారి జిల్లా సంజీవరాయలకోట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గతం కంటే ఈ సారి కర్ణాటక ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇంకా ఎన్నికలు ముగిసేలోపు ఏం జరుగుతుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.