Red Ants: ‘‘ బలవంతుడ నాకేమని, పలువురితో నిగ్రహించి పలుకుటమేల.. బలవంతమైన సర్పం, చలి చీమల చేత చిక్కి చావదే సుమతీ!’’ అని తెలుగులో ఓ పద్యం ఉంది. చీమల గుంపు తలుచుకుంటే పెద్ద పామునైనా చంపేస్తాయని దాని అర్థం. నిజమే.. చీమలు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలవు. ఓ పెద్ద గ్రామాన్నే దడదడ లాడించగలవు. ఒరిస్సా రాష్ట్రంలోని ఓ ఊర్లో ఇదే పరిస్థితి నెలకొంది. చీమల కారణంగా జనం భయపడిపోయారు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇంతకీ సంగతేంటే.. మొన్నీమధ్య వచ్చిన వరదల కారణంగా ఒరిస్సాలోని బ్రాహ్మణ్‌షాహి అనే గ్రామంలో చీమలు తమ ఆవాసాల్సి కోల్పయాయి.
భూమి లోపల కాలనీల్లో ఉండే అవి బయటకు వచ్చేశాయి. ముఖ్యంగా ఎర్ర చీమలు. పెద్ద సంఖ్యలో అవి ఊరి మీద పడ్డాయి. ఊరి జనం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ దూరి అల్లాడించేస్తున్నాయి. దీనిపై గ్రామస్తులు మాట్లాడుతూ.. ‘‘ ఉన్నట్టుండి ఎర్ర చీమలు ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తున్నాయి. సరిగా తినలేకపోతున్నాం.. నిద్రపోలేకపోతున్నాం.. కూర్చోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎర్ర చీమలు మీద పడి కరిచేస్తున్నాయి. వాటి కొండ్లు చాలా బాధను కలిగిస్తున్నాయి. పిల్లలు చీమల భయానికి చదువుకోలేకపోతున్నారు’’ అని పేర్కొన్నారు.
చీమల కారణంగా కొంతమంది ఇళ్లు ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు, స్థానిక అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎర్ర చీమల పై యుద్ధం ప్రకటించారు. వాటిని కాల్చి చంపేయాలని నిశ్చయించుకున్నారు. మంగళవారం ఈ మేరకు తీర్మానం చేసుకున్నారు. చీమలు ఎక్కడ కనబడినా వాటిని చంపేసి, గ్రామాన్ని క్లీన్ చేయటానికి సిద్దమయ్యారు. మరి, చీమలపై యుద్ధం ప్రకటించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: రూ.1000 కోసం గర్భిణిని అడవిలో వదిలేసి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్!