కృషి.. పట్టుదల.. తపన.. ఈ మూడు ఉంటే మనిషి సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు ఈ లోకంలో. కానీ కొంత మంది సకల భోగాలు అనుభవిస్తూ కూడా నిరాశా.. నిస్ప్రూహలకు లోనవుతూ ఉంటారు. తమకు ఉన్న మానసిక, శారీక వైకల్యాలను సాకుగా చూపి జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాత్రం అందరికి ఆదర్శంగా నిలుస్తూ.. తనకు ఉన్న వైకల్యాన్ని జయించి అందరి ఆకలి తీరుస్తున్నాడు. ఇప్పుడు దేశమంతా అతనికి సలాం చేస్తోంది. దానికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అతడో దివ్యాంగుడు.. కానీ ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి.. తన బలహీనతను సాకుగా చూపలేదు.. మనకు దారి చూపుతున్నాడు.. అవయవాలు అన్నీ సక్కగా ఉండి ఏపనీ చేయని వాళ్లు అతన్ని చూసి సిగ్గుపడేలా చేస్తున్నాడు. ఇంతకు అతను చేసే పనేంటంటారా! ఫుడ్ డెలివరీ.. అవును అతను జోమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. దీంట్లో విశేషం ఏముంది అంటారా. అతడు తన వీల్ ఛైర్ లాంటి బైక్ పైనే తన కష్టమర్లకు భోజనం అందిస్తున్నాడు.
తాజాగా అతడి వీడియో వైరల్ గా మారింది. గ్రూమింగ్ బుల్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేశారు. దానికి ‘ఏదీ కూడా అసాధ్యం కాదు.. అసాధ్యమనే పదమే నాకు సాధ్యం’ అంటూ క్యాప్షన్ ను జత చేశారు. దీంతో నెటిజన్లు అందరూ ఆ డెలివరీ బాయ్ ను మీరే మాకు నిజమైన స్ఫూర్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అలాగే జోమాటో కంపెనీని సైతం ప్రశంసిస్తున్నారు. ప్రజల ఫీడ్‌బ్యాక్‌పై స్పందించిన జొమాటో.. ధన్యవాదాలు తెలిపింది. తమ డెలివరీ పార్టనర్ల విషయంలో తామెంతో గర్వంగా ఫీలవుతున్నామని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంచి ఆహారాన్ని అందివ్వడంలో వారు వెనకడుగు వేయడం లేదని తెలిపింది. మరి తన వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న ఈ గొప్ప వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆమె సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది.. 500కి 496 మార్కులు సాధించింది!
ఇదీ చదవండి: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం: బ్యాంకు అధికారుల వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య!