కబడ్డీ ఆట అంటే అందరికీ ఇష్టమే. కానీ, ఆ ఆటను ఆడటం చూసినంత తేలిక కాదు. కబడ్డీ ఆడాలంటే మంచి ఫిట్ నెస్, స్టామినా కావాలి. ఏ కొంచెం వీక్ గా ఉన్నా కూడా ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
న్యాచురల్ స్టార్ నాని నటించిన భీమిలీ కబడ్డీ జట్టు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. నాని కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పచ్చు. సినిమా చివర్లో ఆట గెలిచిన తర్వాత నాని చనిపోతాడు. అయితే అంతా కబడ్డీ ఆటలో చచ్చిపోతారా అని అప్పుడు అనుకుని ఉంటారు. కానీ, ఇప్పుడు ఈ ఘటన చూస్తే నిజం అని నమ్ముతారేమో.. దాదాపుగా సినిమా తరహాలోనే ఈ ఘటన జరిగింది. ఓ 20 ఏళ్ల కుర్రాడు కబడ్డీ ఆడుతున్నాడు. ఆట మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఏంటా అని అంతా వెళ్లి చూడగా అతను అప్పటికే చనిపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న కొందరు ఫోన్ లో వీడియో తీశారు.
ఈ విషాద ఘటన ముంబైలో జరిగింది. కృతిక్ రాజ్ మల్లాన్(20) కబడ్డీ ఆటగాడు. గురువారం మలద్ లోని ఆకాశ్ కళాశాలలో జరిగిన కబడ్డీ పోటీల్లో అతను పాల్గొన్నాడు. కూతకు వెళ్లి పాయింట్ తెచ్చేందుకు ప్రయత్నించాడు. కాకపోతే ఆ సమయంలో ప్రత్యర్థులు అతడిని లైన్ బయటకు పంపి అవుట్ చేశారు. అక్కడి నుంచి తన టీమ్ వైపు అడుగులు వేస్తూనే కృతిక్ రాజ్ కుప్పకూలాడు. ఇరు జట్టు సభ్యులు అతడి వద్దకు పరుగులు పెట్టారు. అతను స్పృహతప్పి పడిపోయాడు అనుకున్నారు. కానీ, అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అక్కడున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కృతిక్ రాజ్ ను శతాబ్ది ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కృతిక్ రాజ్ గుండెపోటుతో చనిపోయిఉండవచ్చనే అభిప్రాయాలు, అనుమానాలు వినిపిస్తున్నారు. కృతిక్ రాజ్ కుటుంబం ముంబైలోని సంతోష్ నగర్ లో నివాసముంటోంది. అతను వివేక్ కాలేజ్ లో బీకామ్ ఫస్ట్ ఇయర్ లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడున్న విద్యార్థులు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ಸಾವು ನಮ್ಮೊಳಗೋ..? ನಾವು ಸಾವಿನೊಳಗೋ..? Kabaddi player dies of a heart attack while playing. The incident has been reported from Maharatra’s Malad. pic.twitter.com/hlu873kNWC
— ಗಣೇಶ್ ಕೆರೆಕುಳಿ (@ganikerekuli) February 11, 2023