కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన వందే భారత్ రైళ్ల పట్ల ప్రజాధారణ పెరుగుతోంది. కాగా వందే భారత్ రైళ్ల రంగును మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఇంతకు ముందు తెలుపు, నీలం రంగులో కనిపించిన వందే భారత్ ఇకపై కాషాయ రంగులో కనిపించనుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే శాఖ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రయాణ సమయాన్ని తగ్గించి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేవిధంగా హైస్పీడ్ రైళ్లను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందేభారత్ రైళ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా వందే భారత్ రైళ్ల రంగు మారనుంది. ఇంతకు ముందు తెలుపు, నీలం రంగులో కనిపించిన వందే భారత్ ఇకపై కాషాయ రంగులో కనిపించనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలో ప్రారంభం కాబోయే వందే భారత్ రైలుకు కాషాయ రంగులు అద్దారు. చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో కాషాయ రంగుతో ఉన్న వందే భారత్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిత్యం వేలమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేయడంలో ఇండియన్ రైల్వే కీలకపాత్ర వహిస్తుంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించడంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లను దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో ప్రారంభిస్తూ వస్తుంది రైల్వే శాఖ. మొట్టమొదటి రైలును న్యూఢిల్లీ-వారణాసి మధ్య ప్రారంభించారు. అయితే రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్ రైలు రంగు మార్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి వెల్లడించారు. వందే భారత్ రైలు తెలుపు రంగులో ఉండడం వల్ల దుమ్ము ధూళి ఎక్కువగా అంటుకుని మురికిగా కనిపించే అవకాశం ఉండడంతో, రంగు మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఇకపై కాషాయ రంగులో వందే భారత్ రైళ్లు దర్శనమివ్వనున్నాయి. వందే భారత్ రైలు కొత్త రంగును జాతీయ త్రివర్ణ పతాకం నుంచి స్ఫూర్తిగా తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి వెల్లడించారు.
Inspected Vande Bharat train production at ICF, Chennai. pic.twitter.com/9RXmL5q9zR
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 8, 2023