మనిషి సృష్టించిన డబ్బు.. ఆ మనిషినే ఆట ఆడిస్తుంది. కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో కొంతమంది సొంత ఇంటికే కన్నం వేస్తున్నారు.. మరికొంత మంది సొంత కంపెనీలక టోపీ పెడుతున్నారు.
ఈ మద్య డబ్బు కోసం మనిషి దేనికైనా సిద్దపడుతున్నాడు. డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు.. బంధాలు, బంధుత్వాలు సైతం మర్చిపోతున్నారు. డబ్బు కోసం సొంత ఇల్లు, సంస్థలను మోసం చేసేవారు కొందరు ఉన్నారు. ఇటీవల ఏటీఎం లలో చోరీలు బాగా పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు ఏటీఎం లో డబ్బులు నింపడానికి వచ్చేవారు చేతివాటం చూపించి వ్యాన్ తో సహ పారిపోయిన సంఘటనలు ఎన్నో జరిగాయి. అచ్చం అలాంటి సంఘటనే అలమ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పట్నాలోని ఆలమ్‍గంజ్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వ్యాన్ డ్రైవర్.. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన రూ.1.5కోట్ల నగదుతో ఉడాయించాడు. సెక్యూర్ వాల్యూ ఇండియా కంపెనీకి చెందిన వ్యాన్ సిబ్బంది ఐసీఐసీఐ ఏటీఎంలో నగదు నింపేందుకు వ్యాన్ లో రూ.1.5 కోట్లతో డంకా ఎమ్లీ గోలంబర్ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో వ్యాన్ లో డ్రైవర్, గన్ మెన్, సంస్థ ఆడిటర్ ఉన్నారు. ఇక ఏటీఎం వద్దకు రాగానే గన్ మెన్, ఆడిటర్ కిందకు దిగారు.. అప్పటికే రన్నింగ్ లో ఉంచిన వ్యాన్ ని డ్రైవర్ వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు వ్యాన్ డ్రైవర్ రూ.1.5 కోట్లతో పరారయ్యాడు. వెంటనే పోలీసుకు సమాచారం అందించాడు బ్యాంక్ ఆడీటర్.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వ్యాన్ డ్రైవర్ ని వెతకడం ప్రారంభించారు. వ్యాన్ డ్రైవర్ పేరు సురజ్ కుమార్ గా గుర్తించారు. ఎత్తుకెళ్లిన వ్యాన్ లో జీపీఎస్ లోకేషన్ ఆధారంగా ఎన్ఎమ్సీఎచ్ రోడ్డు పక్కన పార్క్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి చూడగా వ్యాన్ లో డబ్బులు కనిపించకుండా పోయాయి. సుత్తితో లాకర్ ని పగులగొట్టి నగదు బయటకు తీసి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వ్యాన్ డ్రైవర్ సూరజ్ ని గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకుంటామని అన్నారు పోలీస్ అధికారి అన్నారు.