సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయింపబడతాయి అని అంటారు. కళ్యాణ ఘడియలు వస్తే ఎవరూ ఆపలేరని అంటారు. బందు, మిత్రుల సమక్షంలో అబ్బాయి, అమ్మాయి వివాహబంధంతో ఏకమవుతారు. ఈ మద్య కొంత మంది ఆడవారు ఆడవారినే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల పురుషులు కూడా ఇలాగే వివాహం చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రకృతి విరుద్దమైనా తమకు నచ్చిన పని తాము చేస్తున్నామని వితండవాదం చేస్తున్నారు. కానీ ఎక్కడా జరగని ఓ వింత సంఘటన గుజరాత్ లో చోటు చేసుకుంటుంది.
క్షమాబిందు అనే యువతి వివాహం చేసుకోబోతుంది.. ఇందులో ప్రత్యేక ఏముందీ అని అనుకుంటున్నారా? ఆమె తనకు నచ్చినవాడినో, లేదా పెద్దలు కుదర్చిన వ్యక్తినో పెళ్లి చేసుకుని వైవాహిక బంధాన్ని ప్రారంభించడం లేదు. తనను తానే పెళ్లాడుతోంది. జూన్ 11 న ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంది. వడోదరలో ఈ వింతైన ఘటన జరుగుతుంది.
ఈ తరహా వివాహం గుజరాత్ లో మొట్ట మొదటిసారిగా జరుగుతుంది. క్షమా బిందు ఈ విషయం గురించి చెబుతూ.. నాకు ఎప్పటికీ వివాహం చేసుకోవాలని లేదు.. కానీ వధువుగా మారాలని అనుకుంటున్నాను. అందుకే స్వియ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దీనికి సంబంధించిన వివరాల కోసం ఆన్ లైన్ లో దేశంలో ఏ మహిళ అయినా తనను తానే పెళ్లి చేసుకుందా? అని పరిశీలించాను. కానీ ఎక్కడా ఆ వివరాలు తనకు కనిపించలేదని.. కనుక దేశంలో తనను తాను ప్రేమించి పెళ్లి చేసుకునే మొదటి వ్యక్తిని నేను అని క్షమాబిందు ప్రకటించింది.
ప్రకృతి విరుద్ధమైన పెళ్లి అయినా ఆమె సంప్రదాయబద్దంగానే చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్వీయ వివాహం అంటే నీ పట్ల అంకిత భావాన్ని వ్యక్త పర్చుతున్నట్లే లెక్క. ఎటువంటి షరతుల్లేని ప్రేమకు నిదర్శనం.. అందుకే ఈ పెళ్లి అని బిందు వింత వాదన వినిపించింది. తన తల్లిదండ్రులు స్వేచ్ఛావాదులంటూ, తన పెళ్లికి దీవెనలు అందించినట్టు చెప్పింది.
గోత్రిలోని ఆలయంలో వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం గోవా వెళ్లాలన్నది క్షమాబిందు ప్లాన్ చేసుకుందట. ఏది ఏమైనా ఈ మద్య యువతుల వింతైన ఆలోచనలు ఆలోచిస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం అనుకోవొచ్చు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.