సినీ హీరోల మీదనో, స్టార్ క్రికెటర్ల మీదనో.. అభిమానాన్ని చూపే ఫాన్స్ గురుంచి మనం చాలానే విన్నాం. టాటూలు వేయిచుకున్నారనో, గుడి కట్టారనో, రక్తదానం చేశారనో.. ఇలా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. కానీ.. 78 బామ్మ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీదున్న తనకున్న అభిమానానికి వెలకట్టలేని బామ్మ.. ఆస్తులన్నింటినీ ఆయన పేరు మీద రాశారు.
ఉత్తరాఖండ్, డెహ్రాదూన్ లోని నెహ్రూ కాలనీకి చెందిన మేఘరాజ్ కుమార్తె పుష్పమంజీలాల్ కు రాహుల్ అంటే అమితమైన అభిమానం. ఆయన సిద్ధాంతాలు నచ్చిన ఆమె.. తన పేరు మీదున్న 50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారం రాహుల్ గాంధీకి చెందేలా వీలునామా రాశారు. సోమవారం పీసీసీ మాజీ చీఫ్ ప్రీతమ్ సింగ్ నివాసానికి వెళ్లిన ఆమె.. రాహుల్ పేరు మీదకు తన ఆస్తులు బదలాయిస్తున్న వీలునామాను అందజేశారు. రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రభావితమయ్యే తన ఆస్తికి వారసుడిగా ఎంపికచేసినట్లు మహిళ తెలిపింది.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో.. చిన్నారికి ఊహించని ఆఫర్!
“దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాహుల్ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆయన అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఈ దేశానికి ఎంతో అవసరం. అందుకే నా మరణానంతరం నా ఆస్తులన్నీ రాహుల్కే చెందేలా వీలునామా రాశాను. ఇదే విషయాన్ని కోర్టుకూ చెప్పాను” అని పుష్ప మంజీలాల్ తెలిపారు. ఈ వీలునామా పత్రాన్ని చూసి తొలుత ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత బామ్మను అభినందించారు.
ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన ‘పోస్ట్ వెడ్డింగ్ షూట్’ సరదా! నదిలో గల్లంతైన నవ జంట!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.