గొప్ప గొప్ప చదువులు, డిగ్రీలు, యూనీవర్శిటీల నుంచి అందుకునే పట్టాలు కూడా కొన్ని సమయాల్లో దేనికి పనికి రావు. మనిషికి చదువు కన్నా ముఖ్యమైంది సమయస్ఫూర్తి. అవును మనకు ఎదురయ్యే సమస్యలకు తగ్గట్లుగా స్పందిస్తూ.. పరిష్కారం కోసం ఆలోచించేవారు అసలు సిసలు విజ్ఞానవంతులు. ఇదే మాటని నిజం చేసి చూపారు ఓ వృద్ధురాలు. ఎదురుగా ఆమెకు పెను ప్రమాదం కనిపించింది. ఏం చేయాలో తోచలేదు. ప్రమాదం గురించి ఎవరికి చెప్పే అంత సమయం కూడా లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించి.. వందలమంది ప్రాణాలు కాపాడింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: మేక మెడలో తాళి కట్టిన యువకుడు..!
ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లా గులేరియా గ్రామానికి చెందిన ఓంవతీ దేవి(65) పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేంది. పొలానికి వెళ్లే దారిలో రైలు పట్టాలు వస్తాయి. వాటి గుండా నడుచుకుంటూ వెళ్తుందఙ. రోజులానే ఆ రోజు కూడా పొలానికి వెళ్తున్న ఓంవతీ దేవి.. తన ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి భయంతో కంపించిపోయింది. రైలు పట్టా విరిగి ఉంది. ఇదే ట్రాక్‌పై రైలు వస్తే.. పెను ప్రమాదం తప్పదని ఓంవతీ దేవికి అర్థం అయ్యింది. కానీ ఏం చేయాలో.. వచ్చే ప్రమాదాన్ని ఎలా ఆపాలో ఆమెకి అర్థం కాలేదు. అధికారులకు తెలపడానికి ఆమెకు అవకాశం లేకుండా పోయింది. వందలాది మంది ప్రాణాలే ఆమె కళ్ల ముందు కదలాడాయి. వారి గురించి ఆలోచిస్తుండగా.. ఓంవతీ దేవికి ఓ ఆలోచన వచ్చింది.
ఇది కూడా చదవండి: ఛీ ఎంత నీచం.. స్టేషన్‌లో టాయిలెట్‌కు వెళ్లిన యువతిపై..అనుకున్నదే తడవుగా తన ఒంటి మీద ఉన్న ఎర్ర చీరను తీసి.. రైలు పట్టాలకు అడ్డంగా కట్టింది. కుస్బా కుస్బా రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎంతో సమయస్ఫూర్తితో ఆలోచించిన ఓంవతీ దేవి.. తాను కట్టుకున్న ఎర్ర చీరను విప్పి పట్టాలకు అడ్డంగా కట్టింది. కాసేపటికే ఆ మార్గంలో ఓ ప్యాసింజర్ రైలు వచ్చింది. పట్టాలకు అడ్డంగా ఉన్న ఎర్రటి చీరను గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. కిందికి దిగి చూడగా పట్టా విరిగి ఉంది. పక్కనే ఓంవతీ దేవి నిల్చుని ఉంది. రైలు పట్టా దెబ్బతిన్నట్టు లోకోపైలట్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: దారుణం: బతికి ఉండగానే కూతురిని భూమిలో పాతిపెట్టిన కసాయి తల్లి!
ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే ఉన్నతాధికారులు విరిగిన రైలు పట్టాను సరిచేశారు. గంట తర్వాత రైలు ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. చీర సాయంతో వందల మంది ప్రాణాలు కాపాడిన ఓంవతీ దేవిని ప్రశంసలతో ముంచెత్తారు రైల్వే అధికారులు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఓంవతీ దేవి సమయస్ఫూర్తి గురించి అందరికి తెలిసింది. ఆమెపై నెటినులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపలో తెలియజేయండి.
श्रीमती ओमवती।
सुबह खेत पर काम करने जा रही थीं।
ट्रैक पार करते समय अचानक टूटी पटरी पर नजर पड़ गई।
ट्रेन आने वाली थी, इन्होंने समझदारी दिखाते हुए अपनी लाल रंग की साड़ी को लकड़ियों की मदद से ट्रैक पर खड़ा कर दिया।ट्रेन रोकी गई, पटरी ठीक हुई तब 30 मिनट बाद ट्रेन रवाना हुई।👏 pic.twitter.com/j4SJPTN3kl
— SACHIN KAUSHIK (@upcopsachin) March 31, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.