దేశంలో ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని.. పేదల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొంత మంది ప్రభుత్వ సిబ్బంది చేస్తున్న దారుణాల వల్లో ఎంతో మంది పేద ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఆస్పత్రిలో చనిపోయిన వారికి కనీసం అంబులెన్స్ సౌకర్యం చేయని కారణంగా చనిపోయిన వారిని తమ భుజాన వేసుకొని కిలోమీటర్ల దూరం నడిచిన హృదయవిదారక ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ లో మరో హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.
చిల్ఖర్ బ్లాక్‌లోని అండౌర్ గ్రామానికి చెందిన 58 ఏళ్ల సకుల్ ప్రజాపతి భార్య కొంత కాలంగా డయాబెటీస్ తో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఆమె కాళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బంది పడుతుంది. తన భార్యను దగ్గరలోని హెల్త్ సెంటర్ కి తీసుకుని వెళ్ళడానికి ఒక బండిలో పడుకోబెట్టుకుని దాదాపు నాలుగు కిలో మీటర్ల వరకు తోసుకుంటూ వెళ్లాడు. అంబులెన్స్ కి పోన్ చేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కేసులకోసమే వస్తారని.. అందుకే కాల్ చేయలేదని అన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో కాస్త యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ దగ్గరకు చేరుకుంది. ఈ విషయం బాధ కలిగించిందని.. ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెల్త్ డైరెక్టర్ జనరల్‌ను కోరారు.
बलिया,उत्तर प्रदेश के वायरल वीडियो में एक बुजुर्ग व्यक्ति मरीज को ठेले पर अस्पताल ले जाते दिखाई दे रहा है।जानकारी प्राप्त होने पर वायरल वीडियो का संज्ञान लेते हुए स्वास्थ्य महानिदेशक को जांच कर दोषियों के विरुद्ध कार्यवाही करने के निर्देश दिए।जिसकी खबर प्रमुख समाचार पत्रों में.. pic.twitter.com/nOjIuIytTn
— Brajesh Pathak (@brajeshpathakup) April 5, 2022