కొంతమందికి ప్రమాదాలతో ఆటాడుకోవటం అంటే సరదా. భయం లేకనో.. సరదా కోసమో తెలీదు కానీ, ప్రమాదకరమైన పనులన్నీ చేస్తుంటారు. అలా ఆ పనులు చేసే నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా, ఓ వ్యక్తి పాముతో ఆట్లాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పాముతో వీడియో తీస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, షహ్నాజ్‌పుర్ జిల్లాలోని మరుజాలా గ్రామానికి చెందిన దేవేంద్ర మిశ్రా ఓ రైతు. ఆ ప్రాంతంలో పాములు పట్టడంలో అతడికి మంచి పేరుంది.
ఇప్పటివరకు అతడు 200లకు పైగా పాములు పట్టుకున్నాడు. శుక్రవారం గ్రామంలోని రవీంద్ర కుమార్ ఇంట్లోకి పాము చొరబడింది. ఇంటి వాళ్లు దేవేంద్రను పిలిపించారు. ఇంట్లోకి వెళ్లి వెతగ్గా ఓ కట్ల పాము కనిపించింది. అతడు దాన్ని పట్టుకుని బయటకు వచ్చాడు. జనం అతడ్ని వీడియో తీస్తున్నారని తెలిసి రెచ్చిపోయాడు. పామును మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు.
ఓ ఐదు నెలల చిన్నారి మెడలో కూడా పామును చుట్టాడు. కొద్ది సేపటి తర్వాత బయటకు వచ్చి పాముతో తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ పాము అతడ్ని కాటేసింది. పాము తనను కాటేయటంతో అతడు తనకు తానే నాటువైద్యం చేసుకున్నాడు. అలా శనివారం రాత్రి కన్నుమూశాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
यूपी के शाहजहांपुर में पूर्व प्रधान को सांप पकड़ना और फिर उसके साथ खेलना भारी पड़ गया। सांप से पहले पूर्व प्रधान खेलते रहे। पकड़ ढीली पड़ी तो सांप ने डंस लिया। इसका वीडियो वायरल हो रहा है।#shajahanpur #videoviral #snakevideo pic.twitter.com/rUGJX9PPXt
— Hindustan UP-Bihar (@HindustanUPBH) August 21, 2022
ఇవి కూడా చదవండి : Viral Video: వీడియో: అకౌంట్‌లో డబ్బు ఇవ్వనన్నారు.. గన్‌తో భయపెట్టి బ్యాంకును హైజాక్ చేశాడు!