ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆతడి భార్యా ఆచూకీ పోలీసులకు లభించడం లేదు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మూడు రోజుల క్రితం జరిగిన వరుస హత్యలతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి తమ్ముడు అయిన అష్రఫ్ అహ్మద్ లను ఏప్రిల్ 15న ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి అతీక్ భార్య షైస్తా పర్వీన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె కోసం స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక అందరు అనుకున్నట్లు అతీక్ భార్య అమాయకురాలు కాదు.. మహా డేండజర్. ఓ వ్యక్తి కేసులో కీలక నిందితురాలిగా షైస్తా పర్విన్ ఉంది. ఈమెను పట్టుకుంటేనే ఈ కేసు ముందుకు సాగుతుందని పోలీసులు తెలుపుతున్నారు. మరి షైస్తా ఎక్కడుంది? అతీక్ కంటే డేంజరా? మరిన్ని వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మెడికల్ కాలేజీకి చెకప్ కోసం మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ లను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారిపై ముగ్గురు దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపారు. ఈ దుండగులు జర్నలిస్టులుగా నటిస్తూ.. ఆ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ నేరానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులు అయిన బందాకు చెందిన లవ్లేష్ తివారి(22), కస్గంజ్ కు చెందిన అరుణ్ మౌర్య(18), హమీర్ పూర్ కు చెందిన మోహిత్ అలియాస్ సన్నీ(23) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషీయల్ కస్టడీని విధించింది.
అయితే అతీక్ హత్యకు రెండు రోజుల ముందు అంటే ఏప్రిల్ 13న ఝాన్సీ జిల్లాలోని పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో జరిగిన ఎన్ కౌంటర్ అతీక్ మూడో కుమారుడు అసద్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇటు కొడుకు అంత్యక్రియలకు గాని, అటు భర్త అంత్యక్రియలకు గానీ షైస్తా పర్వీన్ రాకపోవడంతో.. పోలీసులకు అనుమానం కలిగింది. ప్రస్తుతం ఆమె కోసం గ్రేటర్ నోయిడా, మీరట్, ఢిల్లీ, ఓఖ్లా, పశ్చిమ బెంగాల్ లోని ప్రదేశాలలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆమె గురించి కొంచెమైనా సమాచారం చిక్కలేదు.
దాంతో ఈ కిలేడీ ఎంత షార్పో అని పోలీసులు అవాక్కైయ్యారు. ఇక షైస్తా పర్వీన్ కు సహాయం చేసిన 20 మంది అనుమానితులను గుర్తించారు పోలీసులు. ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్య కేసులో పర్వీన్ కీలక సూత్రధారి. ఈమెతో పాటుగా.. గుడ్డు ముస్లీమ్, సాబీర్, ఆర్మాన్ లు కూడా పరారీలో ఉన్నారు. అయితే పర్వీన్ భర్తను మించిన రౌడీగా అక్కడి స్థానికులు చెబుతున్నారు. మహిళ అని అమాయకురాలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే అని చెప్పుకొస్తున్నారు అక్కడి ప్రజలు. అదీకాక ఇన్ని స్పెషల్ టీమ్స్ ఆమె కోసం గాలిస్తున్నప్పటికీ కూడా ఆమె ఆచూకీ తెలియకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె కోసం ఓ ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు.