గత కొంత కాలంగా సినీ, రాజకీయ నేతలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్, మెసేజ్ లు రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మూడు రోజుల్లో చంపేస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ వాట్సాప్ కాల్ వచ్చింది. వెంటనే సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు లక్నో పోలీసులు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 3 రోజుల్లో బాంబుతో హతమారుస్తామని ఆగంతకులు హెచ్చరించారు. ఆగస్టు 2న లక్నో కంట్రోల్ రూంలోని వాట్సాప్ హెల్ప్ లైన్ కి ఈ హెచ్చరికలు వచ్చాయి. వెంటనే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నారు. బెదిరింపు సందేశాలను ఎవరు పంపించారు.. ఎక్కడి నుంచి పంపించారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బెదిరింపుకు పాల్పపడిన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేశామని లక్నో పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో రెండోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించారు సీఎం యోగి. గత కొంత కాలంగా ఆయన నేరాలు అదుపు చేయడం కోసం బుల్డోజర్ యాక్షన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఒకదశలో నేరాలకు పాల్పపడితే సొంత పార్టీ నేతలను కూడా వదలడం లేదు సీఎం యోగి. ఇది చాలా మంది అక్రమార్కులు, మాఫియాలో గుబులు పుట్టిస్తోంది.
అంతేకాదు యోగీ కొంత కాలంగా ఉగ్రవాద సంస్థలు, వారికి సహకరించే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం యోగికి బెదిరింపులు వచ్చి ఉంటాయని తెలుస్తోంది పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A case has been registered at Sushant Golf City police station after receiving a WhatsApp message threatening to kill UP CM Yogi Adityanath. Search for the accused underway: Lucknow Police
(file pic) pic.twitter.com/3k1V2TXmcV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022