BMW Accident: అది అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు.. రోడ్డుపై 230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లోంది.. 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలన్నది వారి లక్ష్యం. ఆ ప్రయాణాన్ని పేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం. ఎదురుగా కంటైనర్? వారి లక్ష్యం నెరవేరిందా? ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తోంది. వారి లక్ష్యం నెరవేరకుపోగా, క్షణాల్లో మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
బీహార్‌లోని డెహ్రీకి చెందిన 35 ఏళ్ల డాక్టర్ ఆనంద్ ప్రకాష్, రోహతాస్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ పని చేస్తున్నాడు. శుక్రవారం బీహార్, ఔరంగాబాద్‌కు చెందిన రియల్టర్ అఖిలేష్ సింగ్, ఇంజినీర్ దీపక్ కుమార్, వ్యాపారవేత్త ముఖేష్ తో కలిసి సుల్తాన్‌పూర్ నుంచి ఢిల్లీకి బీఎండబ్ల్యూ కారులో వెళ్తున్నాడు. కారును డ్రైవ్ చేస్తోంది.. ఆనంద్ ప్రకాష్. కారు స్పీడో మీటర్‌ను ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ కు జత చేశారు. క్షణాల్లో 230 కిలోమీటర్ల వేగానికి చేరుకుంది. ఈలోపు అందరూ సీటు బెల్టులు పెట్టుకోవాలని ఆనంద్ హెచ్చరించాడు. ఖాళీ రోడ్డు కనిపించగానే 300 కిలోమీటర్ల వేగాన్ని చేరుతానని స్నేహితులకు భరోసా ఇచ్చాడు.
అంతలోనే అతని మనసులో ఏమనిపించిందో ఏమో.. ‘మనం నలుగురం చనిపోతాం’ అన్నాడు. అందులోని ఒకరు ‘స్లో డౌన్’ అని అరిచాడు. అయితే వేగం తగ్గించవద్దని, బ్రేకులు వేయవద్దని మరో వ్యక్తి చెప్తున్నాడు. ఈజీగా తీసుకోవాలని మూడో వ్యక్తి సూచిస్తున్నాడు. ఈలోపే వారిముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు ఇంజిన్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న వారంతా కొంత దూరంలో ఎగిరిపడి మరణించారు. వారి శరీరాలు మాంసం ముద్దలయ్యాయి. ఈ ప్రమాదాల్లో మరణించిన వారంతా 30 ఏళ్ల వయసు వారే. వీరి శరీరాలు చూశాక అటునుంచి వెళ్తున్న వారందరు కన్నీరు పెడుతున్నారు. ప్రమాదం తరువాత కంటైనర్ డ్రైవర్ అక్కడినుండి పారిపోగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
हादसे से ठीक पहले फेसबुक पर लाइव आकर दिखाई BMW की स्पीड.
(पार्ट-2) pic.twitter.com/PuzPRbgw1w
— UnSeen India (@USIndia_) October 15, 2022