దేశంలోనే మొట్టమొదటి అర్బన్ పాడ్ హోటల్ ప్రారంభంమైంది. ఈ హోటల్‌ను IRCTC, భారతీయ రైల్వేస్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఏదైన పని మీద ముంబయి వచ్చిన వారికి ఇవి బాగా ఉపయుక్తంగా ఉంటాయి. చిన్న పని మీద వచ్చి హోటల్ రూమ్‌లకు ఎక్కువ డబ్బులు వృథా చేసుకునే పని లేకుండా.. ఇలా అర్బన్ పాడ్ అని రూమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతర్జాతీయ ప్రాయాణీకులను ఆకర్షించేందుకు జపాన్ ప్రభుత్వం ఈ పాడ్ హోటల్ కాన్సెప్ట్ ను ప్రారంభించింది. ఇప్పుడు అదే దారిలో ఇండియన్ రైల్వేస్ కూడా ఈ పాడ్ హోటల్‌ను ముంబయిలో పరిచయం చేసింది.
ముంబయి సెట్రల్‌లో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వెయింట్ రూమ్స్‌లోనే ఈ పాడ్ హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఈ పాడ్ హోటల్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. వైఫై, టీవీ, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్, సీసీ కెమెరాలు, కీకార్డ్ యాక్సెస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మొత్తం 48 పాడ్స్ తో ఈ ‘అర్బన్ పాడ్’ హోటల్‌ను ప్రారంభించారు. వాటిలో 30 క్లాసిక్ పాడ్లు, 7 ప్రైవేట్ పాడ్స్, ఒక వికలాంగుల కోసం కేటాయించారు.
ఈ పాడ్స్ రేట్స్ కూడా వెల్లడించారు. క్లాసిక్ పాడ్ కు 12 గంటలకు రూ.999 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. మహిళలకు కేటాయించిన ప్రత్యేకమైన పాడ్స్ కు క్లాసిక్ పాడ్స్ ధరనే నిర్ణయించారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి కేటాయించిన పాడ్ ధరను 1500 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. ప్రత్యేకమైన పాడ్స్ ధరను రూ.1249 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. 24 గంటలకు క్లాసిక్ పాడ్, మహిళల పాడ్స్‌కు రూ.1999 వేలు ప్లస్ జీఎస్టీ, ప్రైవేట్ పాడ్స్‌కు 2500 ప్లస్ జీఎస్టీ, డిఫరెంట్ ఏబుల్డ్ పాడ్‌కు 24 గంటలకు 2999 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. అర్బన్ పాడ్ హోటల్ కాన్సెప్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
‘Urbanpod’a new stay concept by IRCTC & Indian Railways for travellers coming to Mumbai for a short span pic.twitter.com/oHFAfTzz3e
— ANI (@ANI) November 18, 2021