ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుంది. అయితే అది ఆసక్తి ద్వారా లేదా కష్టాల ద్వారా బయటపడుతుంది. ఈ క్రమంలోనే అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయి. అలా తమ సృజనాత్మకతకు మేధస్సును జోడించి ఎందరో అనేక వస్తువులను ఆవిష్కరించారు. ఇంక ఎన్నో వినూత్నమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. తాజాగా వేడిగాలులకు తట్టుకోలేకపోయిన ఓ సామాన్యుడు.. తన సమస్యకు పరిష్కారంగా ఓ అద్భుతమైన ఆవిష్కరణకు నాంది పలికాడు. మరి.. ఆ వ్యక్తి ఎవరు? ఏంటి ఆయన కనిపెట్టిన ఆ కొత్త పరికరం? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాకు చెందిన 77 ఏళ్ల లల్లూరాం పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటింటికీ వెళ్లి పూలు అమ్మడం ఆయన దినచర్య. వయస్సు మీద పడటంతో అతని ఆరోగ్యం క్షిణించింది. ఎండలో పూలు అమ్మడం కష్టంగా మారింది. అలా అని ఇంటి వద్దే ఉందామా అంటే.. ఇళ్లు గడవదు. దీంతో ఎండ నుంచి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని లల్లూరాం ఆలోచనలో పడ్డాడు. తీవ్రంగా కృషిచేసి ఓ కొత్త ప్లాస్టిక్ హెల్మెట్‌తో సోలార్ ఫ్యాన్‌ని తయారు చేశాడు. అది పెట్టుకుని ఊరంత తిరుగుతున్నాడు. లల్లూరాం స్థానిక జనం వింతగా చూస్తున్నారు. ఇంత పెద్ద వ్యక్తి అలాంటి ఆలోచన ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.
లల్లూరాం హెల్మెట్‌కి చిన్న టేబుల్ ఫ్యాన్ ని అమర్చాడు. ఇది సోలార్ సాయంతో ఆ ఫ్యాన్ నడిచేలా ఏర్పాట్లు చేశాడు.అ నారోగ్యం కారణంగా లల్లూరాం వ్యాపారం తగ్గిపోవడంతో పాటు కొత్త వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. దీంతో ఆ వస్తువును తయారు చేయడానికి అవసరమైన సామాగ్రిని తెలిసిన వ్యక్తుల నుండి సేకరించానని చెప్పాడు. ఇలా తన సమస్యకు తానే పరిష్కారం కనుకున్నారు లల్లూరాం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A flower seller in #LakhimpurKheri district has come up with an innovation that helps him beat the heat.
Seventy-seven-year-old Lalluram has fitted a small solar panel and a tiny fan on his helmet that he wears when he goes out to sell flowers. pic.twitter.com/rYNqBl3sZZ
— IANS (@ians_india) September 21, 2022
देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग
सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS
— Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022