ఒకప్పుడు విదేశీయుల భారతీయ వివాహ వ్యవస్థపై ప్రశంసలు కురిపించేవారు. అయితే మోడ్రనైజేషన్ పేరుతో.. మన ఆహార్యం, ఆహారం మార్చుకుంటూ వెళ్తూ.. ఆఖరికి మన సంప్రదాయాలు, ఆచారాలను కూడా ఏమారుస్తున్నాం. కొందరు వ్యక్తులు తమ చేష్టలతో పవిత్రమైన వివాహా బంధాన్ని సైతం అపహాస్యం చేస్తున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరిని వరుసగా పెళ్లిల్లు చేసుకుంటూ మోసం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిలో ఆడవారు కూడా ఉండటం గమనార్హం.
ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ప్రబుద్ధుడు అప్పటికే రెండు పెళ్లిల్లు చేసుకుని.. ఏడుగురికి జన్మనిచ్చాడు. ఆ తర్వాత రహస్యంగా మరో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఆఖరికి ఐదో పెళ్లికి సిద్ధమవుతుండగా.. రంగంలోకి దిగిన భార్య, పిల్లలు చితకబాది.. పోలీసులకు అప్పగించారు. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీతాపూర్‌కు చెందిన 50 ఏళ్ల షఫీ అహ్మద్ అనే వ్యక్తి కాంట్రాక్టర్‌గా పని చేసేవాడు. మొదటి భార్యతో విడాకులు తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఏడుగురు సంతానం. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి రెండో భార్యతో తరచుగా గొడవపడుతూ.. ఆమె నుంచి కూడా దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో షఫీ.. ఇద్దరు మహిళలను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అక్కడితో ఆగాడా అంటే లేదు.
ఏకంగా ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు. ఒకవేళ తన పెళ్లి గురించి మిగతా భార్యలకు తెలిస్తే.. ఇబ్బంది అని భావించి.. వారిని తప్పించేందుకు తెలివిగా హజ్ యాత్రకు పంపించే ఏర్పాట్లు చేశాడు. కానీ షఫీ ఐదో వివాహం గురించి రెండో భార్య, ఏడుగురు పిల్లలకు తెలిసింది. దాంతో వారు బంధువులతో కలిసి.. పెళ్లి మండపం వద్దకు చేరుకున్నారు. తమ తండ్రికిది ఐదో పెళ్లని.. గతంలో అతగాడు చేసిన మోసాల గురించి వివరించి.. పెళ్లిని అడ్డుకున్నారు.
ఇక తమకు ఇంత అన్యాయం చేస్తున్న తండ్రిని పట్టుకుని చితకబాదారు అతడి ఏడుగురు పిల్లలు. ఈ గొడవ చూసిన నవ వధువు.. అక్కడ నుంచి పారిపోయింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షఫీ పిల్లలు, అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Uttarpradesh: Rest of the wives was sent on #Haj Pilgrimage, Father of 7 children from 2nd wife, was going to do 5th Nikaah (marriage): In Sitapur, the 2nd wife along with the children ßeat up the husband, the new bride absconded.
बाकी पत्नियों को हज यात्रा पर
+@Uppolice pic.twitter.com/oI0xQRrw1J— Ashwini Shrivastava (@AshwiniSahaya) September 1, 2022