ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే అక్కడ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో బాంబు పెట్టామని బెదిరింపు మెయిల్స్ రావడంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉండే బస్టాంట్స్, రైల్వే స్టేషన్స్, పార్కుల్లో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ మద్య కాలంలో కొంతమంది బాంబు బెదిరింపు కాల్స్ తో అధికారులకు, ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా రైళ్లు, బస్ స్టేషన్స్, విమానాశ్రయాలు, సెలబ్రెటీ ల నివాసాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి హడావుడి చేయడం.. తర్వాత అది ఫేక్ కాల్ అని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకోవడం లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోని విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టుగా ఫోన్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత అది ఫేక్ కాల్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాల్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జీకర్ అనే 20 ఏళ్ల యువకుడు ‘ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్ లో బాంబ్ పెట్టారు.. వెంటనే అలర్ట్ కాండి.. లేదంటే ప్రమాదం’ అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయబడిందని పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే అలర్ట్ బాంబు కోసం గాలింపు చేపట్టగా ఎలాంటి జాడ తెలియకపోవడంతో అతి ఫేక్ కాల్ గా గుర్తించామని అన్నారు.
ఆ యువకుడు ఫోన్ చేసిన నెంబర్ ఆధారంగా లొకేషన్ ని తెలుసుకున్నామని.. ఆ యువకుడు ఉత్తర్ ప్రదేశ్ లోని హాపూర్ కి చెందిన జాకీర్ గా గుర్తించామని అన్నారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గా పోలీసులు తెలిపారు. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం సాదిక్ నగర్‌లోని ది ఇండియన్ స్కూల్ ఆవరణలో బాంబులు ఉన్నాయని ఓ మెయిల్ రావడంతో స్కూల్ యాజమాన్యం హడలిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అది ఫేక్ కాల్ గా గుర్తించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా ఎక్కడ కూడా పేలుడు పదార్ధాల జాడ తెలియలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
UP Man, 20, Arrested Over Hoax Bomb Call At Delhi Airport: Police https://t.co/OLx218BZSg pic.twitter.com/6JKUR4khVa
— NDTV News feed (@ndtvfeed) April 27, 2023