ఒక రాజకీయ నేత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిండు ప్రాణం పోయింది. అయినా ఆ నాయకుడు కనీసం పశ్చాత్తాపం చెందలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
ఓ రాజకీయ నాయకుడి నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. అంబులెన్స్‌కు దారిలేకుండా రోడ్డు మీద అడ్డంగా కారు నిలిపి వ్యక్తి చనిపోయేందుకు కారకుడయ్యాడో నేత. అయినా కనీసం పశ్చాత్తపం కూడా లేకుండా తిరిగి బాధితులకే వార్నింగ్ ఇచ్చాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. సీతాపూర్ జిల్లాకు చెందిన సురేష్ చంద్ర అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నో ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో వారు మెరుగైన ట్రీట్మెంట్ కోసం అంబులెన్స్‌లో లక్నోకు బయల్దేరారు. అయితే ఈ అంబులెన్స్ వెళ్తున్న మార్గమధ్యలో ఉమేష్ మిశ్రా అనే బీజేపీ నేత తన వాహనాన్ని రోడ్డుపై ఆపి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఉమేష్ తన వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా నిలపడంతో అంబులెన్స్ వెళ్లేందుకు ఛాన్స్ లేకపోయింది. అరగంటపాటు అక్కడే ఆగిపోవడంతో బాధితుడు విలవిల్లాడిపోయాడు. ఆఖరుకు వైద్యసాయం అందక అంబులెన్స్‌లోనే కన్నుమూశాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత తన కారు దగ్గరకు వచ్చిన ఉమేష్ తిరిగి బాధితుల మీదే ఎదురుతిరిగాడు. చేసిన తప్పుకు కనీసం పశ్చాత్తాపం చెందకుండా.. బాధితులను బెదిరించాడు. నోటికొచ్చినట్లు దూషిస్తూ పోలీసు కేసు పెడతానన్నాడు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా తన సూచనల ప్రకారమే పనిచేస్తారని, మిమ్మల్ని అంతం చేస్తానంటూ భయపెట్టాడు. ఆ టైమ్‌లో అక్కడ పోలీసులు ఉన్నా చోద్యం చూశారు. ఈ ఘటనను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
In UP’s Sitapur, man identified as Umesh Mishra threatens of dire consequences and hurls abuses at family members of a patient who died after Mishra’s unattended car blocked the ambulance. Mishra identified himself as brother of a local BJP block pramukh Ram Kinker Pandey. pic.twitter.com/1UleT5tPyE
— Piyush Rai (@Benarasiyaa) April 4, 2023