కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కొత్త అవతారమెత్తారు. రాజకీయాల్లో ఉంటూనే ఆమె రచయితగా మారి తాజాగా అమర జవాన్లపై ఓ పుస్తకం రాసింది. అయితే తాజాగా ఈ పుస్తకానికి సంబంధించిన కవర్ పేజీని సోషల్ మీడియాలో ఆమె పంచుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లే.. 2010లో చత్తీస్ గఢ్ లోని దంతేవాడలో భద్రతా బలగాలకు చెందిన 76 మంది వీర మరణం చెందిన విషయం తెలిసిందే.
అప్పట్లో ఈ విషాద ఘటన సంచలనంగా మారింది. అమర వీరుల సేవలను గుర్తు చేసుకుంటూ స్మృతి ఇరానీ రాసిన లాల్ సలాం అనే పుస్తకాన్ని వెస్ట్ ల్యాండ్ పబ్లిషింగ్ సంస్థ ముద్రించింది. ఇక మొత్తానికి ఆమె జవాన్లపై రాసిన ఈ పుస్తకాన్ని నవంబరు 29న మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాను రాసిన ఈ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారనే నమ్మకం నాకుందని ఆమె తెలిపింది. అయితే ప్రస్తుతం స్మృతి ఇరానీ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖామంత్రిగా విధులు నిర్వర్తిస్తోంది.
Unveiling Lal Salaam !
You can pre-order here: https://t.co/Hukqbqm1aq pic.twitter.com/2LHLT2ueFx
— Smriti Z Irani (@smritiirani) November 17, 2021