పైన కనిపిస్తున్న బాలిక పేరు తేజస్విని. చిన్నప్పటి నుంచి ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. ఇదిలా ఉంటే అయితే ఓ రోజు రాత్రి మిగిలిపోయిన ఇడ్లీ-సాంబర్ తినింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మిగిలిపోయిన ఇడ్లీ-సాంబర్ తిన్న ఓ బాలిక చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నారు. అసలు మిగిలిపోయిన ఇడ్లీ-సాంబర్ తినడం వల్ల బాలిక చనిపోవడం ఏంటి? దీని వెనకాల అసలు ఏం జరిగిందంటే? మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ప్రాంతం. ఇక్కడే తేజస్విని అనే బాలిక నివాసం ఉంటుంది.
ఆమె స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఇంటర్ సెకండీయర్ చదువుతోంది. తేజస్వినికి బాగా చదువుకుని ఎలాగైన డాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. దీని కోసం బాగానే కష్టపడి చదివింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ రోజు రాత్రి తేజస్విని ఆమె తాత ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ-సాంబర్ తిన్నారు. అది తిన్న కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ తేజస్విని తాజాగా ప్రాణాలు విడిచింది.
ఇక ఆమె తాత మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగానే తేజస్విని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఉన్నట్టుండి తేజస్విని మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. మిగిలిపోయిన ఇడ్లీ-సాంబర్ తినడం వల్లే తేజస్విని చనిపోయిందని తెలుసుకున్న స్థానికులు భయందోళనలకు గురవుతున్నారు.