నేటికాలంలో కొందరు యువకులు ఓవరాక్షన్ కు హద్దే లేకుండా పోతుంది. తాము పబ్లిక్ లో ఉన్నామనే విషయమే మరచి పశువులా ప్రవర్తిస్తున్నారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లో ఉండే మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు యువకులు అయితే బస్సులు, రైళ్లలో కూడా శృతిమించి ప్రవర్తిస్తున్నారు. కేకలు వేస్తూ, వస్తువులు కాగితాలు విసురుతూ, సిగరెట్లు తాగుతూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు ఎప్పటికప్పుడు స్పదిస్తూ.. అల్లరిమూకలను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. అయినా కూడా ఇంకా అక్కడక్కడ పోకిరిలా ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇద్దరు యువకులు రైలు బోగిలోనే సిగరేట్ తాగుతూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారు. అదే బోగిలో ప్రయాణిస్తున్న కొందరు యువతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిత్యం వేలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో ఏ చిన్న ప్రమాదం జరిగిన కూడా ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. అలానే ప్రయాణికుల రక్షణకు, భద్రతకు పెద్ద పీట వేస్తూ ఇండియన్ రైల్వే అనేక చర్యలు తీసుకుంది. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉండే పదార్ధాలను రైల్లోకి అనుమతిచడం లేదు. అలానే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే.. కఠిన చర్యలకు కూడా వెనుకాడటం లేదు. రైల్వే అధికారులు ఇంతలా చర్యలు తీసుకుంటున్నా.. కొంతమంది పోకిరిలు అధికారుల కళ్లుగప్పి నిషేధిత చర్యలకు పాల్పడుతుంటారు. తాజాగా ఇద్దరు యువకులు మహిళలు, పెద్దవారు, పిల్లలు ఉన్నారనే విషయాన్ని మరచి.. సిగరెట్ తాగుతూ బోగిలోనే పొగ వదిలారు. సిగరెట్ తాగవద్దని ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడారు. అంతేకాక మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు.
ఈ పోకిరిలా వీడియోను మనీష్ జైన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. “పెద్దలు, పిల్లలు, ఆడవారి ముందు ఇద్దరు యువకులు పొగతాగారు. అలా చేయవద్దని చెప్పిన వారిపై ఇష్టారీతిన ప్రవర్తించారు. ఈ ఘటన రైలు నెంబర్ 14322 లోని కోచ్ నెంబర్ ఎస్-5 లోని 39,40 సీట్ల వద్ద ఈ ఘటన జరిగింది. దయచేసి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోండి” అంటూ సదరు యువకుడు రైల్వే శాఖ అధికారిక ట్విటర్ ఖాతకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. రైళ్లలో తరచూ అగ్నిప్రమాదాల ఘటనలు కలవర పెడుతుండగానే.. బాత్రూమ్‌లలో సిగరెట్, బీడీ పీకలు కనిపిస్తుంటాయి. ఏదైనా జరగరానిది జరిగితే వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పబ్లిక్ ప్రదేశాల్లో అల్లరి చేసే వారిని సొంత కుటుంబసభ్యులే ఉపేక్షించకూడదు. ఇలాంటి వారి విషయంలో శిక్షలు మరింత కఠినం చేయాలని, జరిమానా భారీగా పెంచాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
@IRCTCofficial @RailMinIndia Passengers Lighting Cigarettes in front of Kids & Senior Citizen and abusing when all are stopping them., Train No 14322 Coach S-5 Seat Number’s 39-40.
Please take action as soon as possible pic.twitter.com/kxQJUDc72T— Manish Jain (@jainmanish0906) February 5, 2023