విధికి ఎవ్వరైనా తలవంచాల్సిందే. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని భావించిన అనేక మంది పెద్దలు కుదిర్చిన వివాహాలకు తలొంచిన వారే. 90 శాతం ప్రేమలు పెళ్లి పీటలు ఎక్కవు. అలాగే ముక్కు, మోహం తెలియని వాడిని పెళ్లి చేసుకుని, సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ ఆమెకు రెండు పెళ్లిళ్లు చేసినా సెట్ కాలేదు.
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అందమైన ఘట్టం. ఎప్పుడు ఎవ్వరితో ముడివేయాలో భగవంతుడికే తెలుసు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడాలా లేదా పెద్దల కుదర్చిన పెళ్లి చేసుకోవాలా అనేది డిసైడ్ చేసేది అతడే. మనం ఎంత గింజుకున్నా.. విధికి ఎవ్వరైనా తలవంచాల్సిందే. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని భావించిన అనేక మంది పెద్దలు కుదిర్చిన వివాహాలకు తలొంచిన వారే. 90 శాతం ప్రేమలు పెళ్లి పీటలు ఎక్కవు. అలాగే ముక్కు, మోహం తెలియని వాడిని పెళ్లి చేసుకుని, సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా పెటాకులు అవుతున్నాయి. అయితే నేటి సమాజంలో ఒక్క పెళ్లితో సరిపెట్టుకోవడం లేదు. రెండవ పెళ్లి వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే మహిళకు మాత్రం రెండు పెళ్లిళ్లు చేసినా సెట్ కాకపోవడంతో పెద్దలు ఏం చేశారంటే..?
తల్లిదండ్రులు చేసిన రెండు పెళ్లిళ్లు ఆ మహిళకు సెట్ కాలేదు. దీంతో చివరికి మూడో పెళ్లి జరిగింది.. ప్రేమించిన వ్యక్తితో. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రాజ్ ఘడ్‌లో గడియా చరణ్ గ్రామానికి చెందిన అనర్ సింగ్ అనే వ్యక్తికి ఎనిమిదుగురు పిల్లలు. వీరిలో రష్మీ అనే అమ్మాయి ఉంది. వీరిది చాలా పేద కుటుంబం. జీవనోపాధి కోసం రాజస్థాన్‌కు వలస వెళ్లారు. అక్కడ ఇటుకల బట్టీ పనులు చేసేవారు. ఈ క్రమంలో రష్మీకి 12ఏళ్లు రాగానే పెళ్లి చేశారు. అయితే అత్తింట్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయిన రష్మీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. ఆమెకు 18ఏళ్లు వచ్చేవరకు తల్లిదండ్రులతోనే ఉంది. అయితే ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటామని రెండవ పెళ్లి ప్రయత్నాలు చేశారు తల్లిదండ్రులు. రష్మీకి మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో రెండవ వివాహం చేశాడు తండ్రి అనర్ సింగ్. ఆమెకు గతంలోనే పెళ్లి అయ్యిందన్న విషయాన్ని దాచి పెట్టి, రెండో పెళ్లి చేశారని.. అగ్గిలం మీద గుగ్గిలమైన మొదటి భర్త..రెండున్నర లక్షలు ఇవ్వాలంటూ మామ అనర్ సింగ్‌ను డిమాండ్ చేశాడు.
రష్మీ రెండవ భర్త ఆ మొత్తాన్ని మొదటి భర్తకు చెల్లించడంతో అతను వెళ్లిపోయాడు. అయితే రష్మీ రెండవ భర్తతో కూడా ఎక్కువ కాలం కలిసి జీవించలేక పోయింది. తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది. రెండవ భర్తనుండి వచ్చేసిన తరువాత రష్మీ కుటుంబం మళ్లీ ఇటుక బట్టీ పనికి రాజస్థాన్ వెళ్లింది. అక్కడ జేసీబీ డ్రైవర్‌తో రష్మీకి పరిచయం అయింది. తొలుత వీరిద్దరూ స్నేహితులుగా ఉండేవారు. ఆ క్రమంలో ఒకరి విషయాలు ఇంకొకరు పంచుకున్నారు. జేసీబీ డ్రైవర్ కూడా గతంలో పెళ్లి అయ్యి కూతురు ఉందని, భార్యకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. తన పెళ్లిళ్ల విషయం కూడా అతడికి తెలిపింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వారంతా ‘రెండు పెళ్లిళ్ల తరువాత జరిగిన ప్రేమ వివాహం అయినా నిలబడితే చాలు’అని అంటున్నారు. ఈ సారైనా రష్మీ అతడితో ఉంటే చాలు అని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట.