అదృష్టం ఎప్పుడు ఎలా తలుపుతడుతుందో తెలియదు అంటారు. అదృష్టం ఉండాలేగానీ.. డబ్బు దానంతట అదే మనల్ని వెతుక్కంటూ వస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. అదృష్టవంతుడిని ఎవరూ చెడపలేరు.. దురదృష్టవంతుడిని ఎవరూ బాగుపర్చలేరు అన్న సామెత తెలిసిందే. పేదరికంతో ఎన్నో కష్టాలు పడేవారు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అనుకోకుండా పదికోట్ల లాటరీ తగిలింది. వివరాల్లోకి వెళితే..
కన్యాకుమారి ప్రాంతానికి చెందిన ప్రదీప్, అతని సమీప బంధువు రమేష్ లకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది. అయితే ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ ఇటీవల తమ బంధువును తీసుకు వచ్చేందుకు తిరువనంతపురం ఎయిర్ పోర్టు కి వెళ్లవలసి వచ్చింది. అలా ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన వారిద్దరూ అంతా తిరుగుతూ షాపింగ్ చేయడం మొదలు పెట్టారు. అదే వారి అదృష్టానికి పూల బాట వేస్తుందని అస్సులు ఊహించలేదు.
టైమ్ పాస్ కోసం వెళ్లిన వారికి అక్కడ లాటరీ అమ్మడం చూశారు.. ఒక లాటరీ కొన్నారు. ధనలక్ష్మి వారి ఇంటి తలుపు తట్టింది. ఈ లాటరీ డ్రా మే 15 న తీయడం జరిగింది.. అందులో ప్రదీప్, రమేష్ లు ఏకంగా పదికోట్లు జాక్ పాట్ కొట్టేశారు. ఈ విషయం లాటరీ నిర్వాహకులు ఇద్దరికీ తెలియజేయడంతో వారి సంతోషాలనికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.