గత కొంతకాలం నుంచి జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో బాంబులు పేలుడు ఘటనలు చాలా వరకు తగ్గాయి. ఉగ్రవాదు దాడులు కూడా దాదాపు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదులు మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ లోని నర్వాల్ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరిగాయి. శనివారం ఉదయం నర్వాల్ లోని రెండు ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరు మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక బాంబు పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. జమ్ము జోన్ అడిషన్ డీజీపీ ముకేష్ సింగ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
శనివారం ఉదయం జమ్ముకశ్మీర్ లోని నర్వాల్ ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర భద్రతా అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్ని స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడు కోసం కార్లకు ఐఈడీ అమర్చినట్లు వెల్లడించారు. ఈ పేలుళ్ల నేపథ్యంలో వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ వరుస బాంబు పేలుళ్లు ఎవరి పని అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి. ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
గత కొంతకాలం నుంచి జమ్మూలో శాంతి భద్రలు అదుపులోనే ఉన్నాయి. అయితే మళ్లీ చాలా కాలం తరువాత బాంబు పేలుళ్లు జరగడంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. అక్కడ కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలానే ఇటీవలే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర జమ్ముకశ్మీర్ లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వరుస బాంబు పేలుళ్లు జరగడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. జమ్మూలో బాంబు పేలుళ్లల నేపథ్యంలో ఆయనకు భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
J&K | Twin blasts occurred in Narwal area of Jammu, 6 people injured. Details awaited. pic.twitter.com/TYkiUoLnCP
— ANI (@ANI) January 21, 2023
#WATCH | J&K: Six people injured in two blasts that occurred in Narwal area of Jammu. Visuals from the spot. Police personnel are present at the spot. pic.twitter.com/eTZ1exaICG
— ANI (@ANI) January 21, 2023