పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు హైదరాబాద్ రావాలని ఆహ్వానిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ పెద్ద రాజకీయ వేడిని రాజేసింది. ఆ ట్వీట్ పై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. హైదరాబాద్ కు ఆహ్వానిస్తూ కేటీఆర్ ట్వీట్ చేయడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపార వేత్తలు బెంగళూరు వస్తుంటారని తెలిపారు. ‘అత్యధికంగా స్టార్టప్స్, యూనికాన్ సంస్థలున్న బెంగళూరు ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. గత మూడేళ్లుగా ఆర్థికంగా ప్రగతి సాధిస్తోంది’ అంటూ బసవరాజు బొమ్మై వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: కేటీఆర్ ట్వీట్.. కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు!
అటు కర్ణాటక బీజేపీ కూడా కేటీఆర్ ట్వీట్ పై ఘాటుగా స్పందించింది. పొరుగు రాష్ట్రాలపై దురంహకార పోటీ తగదని వారించింది. ‘మన పళ్లెంలో ఈగ పడినా పట్టించుకోని వారు పక్కింటి వారి పళ్లెంలో ఈగ గురించి మాట్లాడటం సహజం. తెలంగాణలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలి. విదేశీ పెట్టుబడుల్లో మీరు ఎన్నో స్థానంలో ఉన్నారు? బెంగళూరుకు మీకు ఎంత వ్యత్యాసం ఉందో చూసుకున్నారా?’ అంటూ ఘాటుగా స్పందించింది. నీతిఆయోగ్ విడుదల చేసిన నవ్యాలోచన సామర్థ్యంలో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేశారు. కేటీఆర్- కర్ణాటక బీజేపీ- సీఎం బసవరాజు బొమ్మై ట్విట్టర్ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dear Shri @DKShivakumar & Shri @KTRTRS,
In 2023, both of you friends can pack up & move to any place you like.
The “double engine governments of BJP” will not only continue to restore glory to Karnataka but will also take Telangana on super highway of progress and prosperity. pic.twitter.com/bFZAjRG0QZ
— BJP Karnataka (@BJP4Karnataka) April 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.