ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం రాత్రి సామాన్యూలను, వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రమూక కాల్పుల్లో ప్రముఖ టీవీ నటి, టిక్ టాక్ స్టార్ ప్రాణాలు కోల్పోయింది. ఆమె పదేళ్ల మేనల్లుడు కూడా ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డాడు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు.. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఉగ్ర కాల్పుల చర్య స్థానికంగా కలకలం రేపుతోంది. కాల్పులకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు వెంటాడి ఎన్ కౌంటర్ చేశారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. బుద్గామ్ జిల్లా హుష్రూ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టీవీ నటి అమ్రీనా భట్(35) ఇంటిపై కూడా కాల్పులు జరపగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నటి మేనల్లుడు పర్హాన్ కు కూడా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
Jammu & Kashmir LG Manoj Sinha condemns the terrorist killing of TV artist Amreen Bhat in Budgam
“We’re firmly resolved to demolish terror ecosystem that continues to receive reinforcement from across the border,” he says.
— ANI (@ANI) May 25, 2022
అమ్రీనా భట్ ను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి ఏదో షూటింగ్ ఉందని బయటకి పిలిచినట్లు ఆమె బావ తెలియజేశాడు. అలా బయటకు రాగానే ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలిపాడు. ఆమె ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదని.. అలాంటిది ఆమె ప్రాణాలు తీశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్రీనా ఇంటిపై కాల్పుల విషయం స్థానికంగా కలకలం రేపింది.
వేరోక ఘటనలో కుప్వారా జిల్లా జుమాగండ్ ప్రాంతంలోకి చొరబడిన లష్కరే తోయిబా సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను రక్షణ దళాలు మట్టుబెట్టాయి. రక్షణ దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాను స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ వెల్లడించారు. ఉగ్రవాదుల చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#KupwaraEncounter | All three terrorists were neutralized, affiliated with proscribed terror outfit LeT. Identification being ascertained. Incriminating materials including arms & ammunition recovered: IGP Kashmir
(File pic) pic.twitter.com/TcoqzExQ8Y
— ANI (@ANI) May 26, 2022