దేశ రాజకీయాల్లో పవర్ ఫుల్ మహిళా నేతల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా ఒకరు. ఏదైనా నిక్కచ్చిగా, ముక్కు సూటిగా మాట్లాడటం ఆమె నైజం. అధికార పార్టీనైనా సరే పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తారు. గత ఏడాది చివర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా దేశంలో తగ్గిపోతున్న పారిశ్రామికోత్పత్తిపై..కేంద్రంలోని అధికార పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ అవసరమంటూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సూచించారు. పార్లమెంట్ లో ఈమె చేసే స్పీచ్ లు ఎప్పటి కప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియో.. దానికి పెట్టిన క్యాప్షన్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
పశ్చిమ బెంగాల్లోని కృష్ణా నగర్ నియోజక వర్గం ఎంపీగా మహువా వ్యవరిస్తున్నారు. ఈ ఏడాది గ్రామీణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు చేరువవ్వాలన్న ఉద్దేశంతో టిఎంసీ.. దీదీర్ సురక్ష కవచ్ (దీదీ రక్షణ కవచం) పేరుతో సరికొత్త ప్రచారానికి తెరలేపింది. ఈ నేపథ్యంలోనే మహువా మెయిత్రా కూడా తన నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా రోడ్డు ప్రక్కనే ఉన్న ఓ టీ స్టాల్ వద్దకు వెళ్లి, టీ కాచారు. ఈ వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఓట్ల కోసం ఇటువంటి రాజకీయ స్టంట్ లు కామనే కానీ.. ఆ వీడియోకి మహువా పెట్టిన క్యాప్షన్.. దేశ ప్రధానికి సెటైర్ లా ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.
టీ కాచిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న మహువా.. ‘నా చేత్తో టీ కాచాను, ఏమో నేను ఏ స్థాయికి వెళతానో.. ఎవరూ చూడొచ్చారు’ అంటూ ట్యాగ్ తగిలించారు. ఇది ప్రధాని మోదీకి సెటైర్ లా (తాను చిన్నప్పుడు టీ కాచేవాడినని పదేపదే ప్రధాని గుర్తు చేసుకుంటూ ఉంటారు) ఉందని కొందరు సోషల్ సైనికులు భావిస్తున్నారు. ఆమె వీడియోకు కొందరు పాజిటివ్ గా, కొందరు నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. దేశానికి ఒక ఛాయ్ వాలా ప్రధానిగా సరిపోతారని ఒక నెటిజన్ అంటే.. దేశానికి రెండవ మహిళా ప్రధాని అయ్యేందుకు ప్రయత్నించే పనిలో ఉన్నట్లున్నారంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు.
Tried my hand at making chai… who knows where it may lead me 🙂 pic.twitter.com/iAQxgw61M0
— Mahua Moitra (@MahuaMoitra) January 11, 2023