ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం వెలుగుచూసింది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన 11 మంది పర్వతారోహకులు దుర్మరణం పాలయ్యారు. హిమాలయాల్లో పర్యాతారోహణకు వెళ్లిన ట్రెక్కర్స్.. వాతావరణం అనుకూలించగా.. ఊపిరాడక అక్కడిక్కడే మరణించినట్లు సమాచాచం. మృతదేహాలను మంచు కప్పేయడంతో గుర్తించడం కష్టం మారినట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్-హిమాచల్ సరిహద్దుల్లోని 17 వేల అడుగుల ఎత్తులో లాంఖగా కనుమ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాను.. ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో లమ్‌ఖగా పాస్ ఒకటి. ఈ మార్గం నుండి ఇప్పటి వరకు 11 మంది మృత దేహాలను వెలికితీశారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్వతారోహకులు అక్టోబర్ 18న భారీగా మంచు కురవడంతో దారితప్పారు. కొంతమంది ట్రెక్కింగ్ వెళ్లి మిస్ అయ్యారని తెలిసిన తర్వాత.. అక్టోబర్ 20న అధికారులు చేసిన ఎస్ఓఎస్ కాల్‌కు భారత వైమానిక దళం స్పందించింది.
రాష్ట్రంలోని పర్యాటక హిల్ స్టేషన్ అయిన హర్సిల్ చేరుకోవడానికి రెండు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏఎల్‌హెచ్ క్రాఫ్ట్‌లో రెస్క్యూ ప్రారంభించింది. మొత్తానికి రెండు రెస్క్యూ సైట్‌లను గుర్తించగలిగారు. దారితప్పిన వారిలో ట్రెక్కర్లతో పాటు పోర్టర్లు, గైడ్లు కూడా ఉన్నారు. డోగ్రా స్కౌట్స్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ బృందాల జాయింట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో మృతదేహాలను గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 11 మృతదేహాలు లభించాయి. కాగా.. గల్లంతైన మిగతావారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.