అతడికి మూఢనమ్మకాలు అంటే ఎంతో నమ్మకం. ఎంతటి అనారోగ్య సమస్య వచ్చినా.. భూత వైద్యం, బాబాలు అంటూ వారి వద్దకే వెళ్తూ వచ్చాడు. ఇటీవల భార్యకు అనారోగ్య రావడంతో బాబా వద్ద వెళ్లాడు. కట్ చేస్తే.. ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
ప్రపంచం అంతా టెక్నాలజీ యుగంతో పరుగులు తీస్తుంటే.. మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఇంకా మూఢనమ్మకాలతోనే బతికేస్తున్నారు. ఎంతటి అనారోగ్య సమస్య వచ్చినా.. భూత వైద్యం, బాబాలు అంటూ వారి వద్దకే వెళ్తూ.. చివరికి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోతూ.. చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు మనం ఇప్పటికీ ఎన్నో చూసి ఉంటాం. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే.. ఓ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్రి విషాదంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు.పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు ఎంతో సంతోషంగా జీవించారు. అలా ఆనందంగా జీవిస్తున్న క్రమంలోనే.. అతడి భార్య నీలమ్ దేవి ఉన్నట్టుండి ఇటీవల కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. దీంతో భర్తకు వైద్యుల కన్నా.. మూఢనమ్మకాలంటేనే ఎక్కువ నమ్మకం. దీంతో ఆమె భర్త ఇటీవల తాను అనుకున్నట్లుగానే.. ఏదో జరుగుతుందని భావించిన తన భార్యను ఓ ఆశ్రమంలో ఉంటున్న బాబా వద్దకు తీసుకెళ్లాడు.
ఆ బాబా కోసం అతడు తన భార్యతో వెళ్లి గంటల తరబడి వేచి చేశాడు, కానీ, ఆ బాబా మాత్రం ఆ ఆశ్రమానికి రాలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో చివరికి నీలమ్ దేవి ప్రాణాలు కోల్పోయింది. ఉన్నట్టుండి భార్య మరణించడంతో భర్త గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇక అదే ఆశ్రమం ముందు భార్య శవాన్ని పెట్టుకుని ఏడుస్తున్న దృశ్యం పలువురుని కంటతడి పెట్టించింది. ఆ సీన్ చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.అయితే దీనిని అక్కడున్న కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు.
ఇక ఇదే వీడియోలు చివరికి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఆ వీడియోలు కాస్త వైరల్ గా మారాయి. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. కిడ్ని సమస్యతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అద్భుతం జరుగుతుందని నమ్మి బాబా వద్దకు తీసుకెళ్లాడు. ఇక పరిస్థితి విషమించడంతో చివరికి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలా ఎంతో మంది అమాయక ప్రజలు మూఢ నమ్మకాలలో పడి.. చివరికి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలలో మగ్గిపోతున్న వారికి మీరిచ్చే సలహాలు, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) February 17, 2023