ఆ యువతికి తండ్రి లేడు, తల్లి వికలాంగురాలు. బాగా కష్టపడి చదివి తల్లికి తోడు, నీడగా ఉండాలనుకుంది. అందుకోసం బాగా చదువుతూ వచ్చింది. కట్ చేస్తే.. కానీ, ఆ యువతి తీసుకున్న నిర్ణయంతో..!
ఆమె పేరు శ్వేత. ప్రభుత్వ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకునేది. ఇటీవల కాలేజీకి వెళ్లాలనుకుంది. అందుకోసం ఓ బస్సు ఎక్కింది. తాను దిగాల్సిన కాలేజీ కూడా రానే వచ్చింది. కానీ, ఇక్కడే శ్వేత కాస్త తొందరపాటు నిర్ణయం తీసుకుని కన్నతల్లికి కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఆమె తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
కర్ణాటక రాష్ట్రం వులిషాడగలి పరిధిలోని హోలాలు గ్రామం. ఇక్కడే శ్వేతా అనే యువతి నివాసం ఉండేది. ఆమె తండ్రి గతంలోనే మరణించగా అప్పటి నుంచి తల్లితో పాటు నివాసం ఉంటుంది. ఇక తల్లి వికలాంగురాలు కావడంతో కూతురే అన్నీ చూసుకునేది. అయితే ఆ యువతి బాగా చదువుకుని తల్లిని బాగా చూసుకోవాలని అనుకునేది. ఇందులో భాగంగానే శ్వేతా హులిగూడలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో E & C విభాగంలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇకపోతే బుధవారం శ్వేత ఫీజు చెల్లించడానికి కాలేజీకి వెళ్లాలనుకుంది. అందుకోసం ఉదయం ఓ బస్సు ఎక్కింది. తాను దిగాల్సిన కాలేజీ కూడా రానే వచ్చింది. కానీ, ఆ కాలేజీ వద్ద బస్ స్టాప్ లేకపోవడంతో డ్రైవర్ బస్సు ఆపలేదు.
దీంతో తొందరలో శ్వేతకు ఏం చేయాలో తెలియక.. వెంటనే బస్సులో నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలపాలైంది. వెంటనే స్పందించిన స్థానికులు.. ఆ యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆ యువతి తాజాగా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఒక్కగానొక్క కూతురు తోడు, నీడగా ఉంటుందేమో అనుకుంటే.. చివరికి నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయిందంటూ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ సీన్ చూసిన గ్రామస్థులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన రావాణాశాఖ అధికారి వెంకటచలపలి రావు.. మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.