నిబంధనలు అందరికీ సమానమే. అది పౌరులైనా, ప్రభుత్వ అధికారులైనా రూల్స్ ఒకేలా అమలవ్వాలి. అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు ఇకపై ఆ తప్పు చేస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని డిసైడ్ అయింది.
పోలీసులకు అందరూ ఎంత గౌరవ, మర్యాదలు ఇస్తారో తెలిసిందే. క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజలను సక్రమ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఎక్కువగా ఉంది. అందుకే వారిని చాలామంది స్ఫూర్తిగా తీసుకుంటారు. తాము కూడా పోలీసులై సమాజానికి తమవంతు సేవ చేయాలని అనుకుంటారు. అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచిన పోలీసు అధికారులు ఎంతో మంది ఉన్నారు. ప్రజా భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారూ ఉన్నారు. క్రమశిక్షణతో వ్యవహరిస్తూ నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వంపై జనాల్లో భరోసా పెంచిన అధికారులు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అభాసుపాలు అయిన వారూ ఉన్నారు.
ప్రభుత్వ నిబంధనలను పాటించేలా చేయాల్సిన పోలీసులే ఉల్లంఘిస్తే ఎలా ఉంటుంది? సర్కారు రూల్స్‌ను పోలీసులు ఉల్లంఘించిన ఘటనలు కొన్ని ఉన్నాయి. వీటి గురించి మనం వార్తల్లో చూస్తున్నాం. దీంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే పోలీసులకు డబుల్ ఫైన్ విధించాలని రాజస్థాన్ సర్కారు డిసైడ్ అయింది. దీంతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. రాజస్థాన్ డీజీపీ ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మరి.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన పోలీసులకు డబుల్ జరిమానా విధించాలని రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.