రోడ్డుపై వెళ్తున్నప్పుడు రూపాయి దొరికినా కళ్లకు అద్దుకుని జేబులో వేసుకుంటారు. అలాంటిది..ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.45లక్షలు. అంత మొత్తంలో డబ్బు దొరికితే తిరిగిచ్చేసిన వాళ్లను ఎప్పుడైనా చూశారా? ఇదిగో ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం నిజాయతీగా ఇచ్చేశాడు. అందుకే.. నిజాయితీకి నిలువెత్తు రూపం.. ఈ ట్రాఫిక్ పోలీస్ అని పొగుడుతున్నారు.
ఛత్తీస్‌గఢ్ కు చెందిన నీలాంబర్ సిన్హా, రాయ్‌పుర్ కయబంధా పోస్ట్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తుంటాడు. శనివారం ఎప్పటిలాగే డ్యూటీలో ఉండగా.. రోడ్లు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది. మొదట అనుమానాస్పద బ్యాగ్ గా అనుమానపడ్డా.. చివరకు ధైర్యం తెచ్చుకొని ఓపెన్ చేసాడు. అందులో అన్నీ రూ.500, రూ.2వేల నోట్లే. వాటి మొత్తం విలువ రూ.45లక్షలు. వెంటనే మరో ఆలోచన చేయకుండా నగదు బ్యాగ్ను స్థానిక పోలీసులకు అప్పజెప్పేశాడు.
‘నీలాంబర్ నిజాయతీకి మెచ్చి పోలీసు అధికారులు అతడికి రివార్డు కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ డబ్బు ఎవరిదీ అన్న విషయం మాత్రం తెలియరాలేదు. డబ్బులు కనిపిస్తే దాచుకోవడం, దోచుకోవడం తప్పితే ఇవ్వడం అనేది చాలా వరకు కనిపించని ఈ రోజుల్లో.. ఇలాంటి వ్యక్తులు ఉండడం సమాజానికి చాలా అవసరం. ఈ మంచి వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“Character is what you are,
When no one is watching you”-A traffic constable Shri Nilambar Sahu from Raipur Police returned a bag containing 45 lakhs to the police station, having found it lying on the road.
Salute to his honesty and integrity. #Chhattisgarh #police #Proud pic.twitter.com/48jlIKr8cM
— Ankita Sharma (@ankidurg) July 23, 2022
ఇది కూడా చదవండి: స్టూడెంట్స్ లిప్ లాక్ ఛాలెంజ్.. ముద్దులతో రెచ్చిపోయిన విద్యార్థులు! వీడియో వైరల్!
ఇది కూడా చదవండి: అలా ఉండగా వీడియోలు తీసి ఆ వెబ్‌సైట్‌కు అమ్మాడు!