మల్లిక శ్రీనివాసన్ బిజినెస్ వ్యవహారాలను విజయపథంవైపు నడిపిస్తూనే.. సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు. అంతేకాదు ఇందిరా శివశైలం ఎండోమెంట్ ఫండ్ ద్వారా చెన్నైలోని..
సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. మనం విజయం సాధించాలన్నపుడు ఏ పనైనా సరే శ్రద్ధ, కఠిన శ్రమ, కఠోర దీక్షతో సాధన చేస్తే విజయం తప్పక వరిస్తుంది. మనసులో విజయ కాంక్షతో ముందువెళుతున్నపుడు మనకు దారులు అవే దొరుకుతాయి. భారత దేశంలో వ్యాపార రంగంలో విజయం సాధించిన మహిళలు చాలా మంది ఉన్నారు. వారిలో మల్లిక శ్రీనివాసన్ ఒకరు. ఆమె విజయగాథ ఏంటో తెలుసుకుందాం.. మల్లిక శ్రీనివాసన్ 1959 నవంబర్ 19న జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీలో ఎమ్ఏ పూర్తి చేసి, ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్లారు. వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి తిరిగి మనదేశానికి వచ్చారు.
1986లో పారిశ్రామికవేత్త ఎస్ అనంతరామకృష్ణన్ స్థాపించిన కుటుంబ వ్యాపారంలో మల్లిక జనరల్ మేనేజర్ గా చేరింది. టేఫ్ కంపెనీని అభివృద్ధి పరుచుటకు ఎంతగానో కృషి చేశారు. కంపెనీ మంచి లాభాలను గడించింది. మహీంద్ర ట్రాక్టర్‌ల తర్వాత మన దేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా టేఫ్ కంపెనీని తీసుకువచ్చారు. మల్లిక శ్రీనివాసన్ లీడర్ షిప్‌లో ఉన్నపుడే టాఫె సంస్థ 2022లో ఫ్రెంచ్ సంస్థ ఫౌరేసియా ఇండియా వ్యాపారాన్ని రూ.400 కోట్ల డీల్‌తో, 2018లో ఐఎమ్‌టీ వంటి కంపెనీలను కొనుగోలు చేసింది. ఆమె ఇటీవల స్టార్టప్ స్విగ్గీ బోర్డ్‌లోకి కూడా అడుగుపెట్టారు.
మల్లిక శ్రీనివాసన్ బిజినెస్ వ్యవహారాలను విజయపథంవైపు నడిపిస్తూనే.. సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు. అంతేకాదు ఇందిరా శివశైలం ఎండోమెంట్ ఫండ్ ద్వారా చెన్నై లోని శంకర నేత్రాలయలోని క్యాన్సర్ ఆస్పత్రికి మద్దతు ఇస్తున్నారు. ఇవే కాకుండా సంగీత సంప్రదాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ‘ట్రాక్టర్ క్వీన్’గా పేరొందిన మల్లిక శ్రీనివాసన్ మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లకంటే ఎక్కువగా ఉందని అంచనా. మల్లిక భర్త వేణు శ్రీనివాసన్ టీవీఎస్ మోటార్స్ సీఎండీగా ఉన్నారు. ఈమె చేసిన కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు పురస్కారం ఇచ్చింది. మల్లిక శ్రీనివాసన్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.