గుజరాత్ లో జరిగిన కేబుల్ బ్రిడ్జ్ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మోర్బీలోని తీగ వంతెన కూలడంతో 120 మందికి పైగా మరణించడం అందరిని తీవ్ర వేదనకు గురిచేసింది. ఈ దుర్ఘటనలో ఓ ఎంపీ కుటుంబం కూడా ఉంది. పురాతనమైన ఈ కేబుల్ బ్రిడ్డీ కూలీన ఘటనకు కొందరు ఆకతాయిలు వంతెనను ఊపడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొందరు యువకులు మాత్రం ఓ బ్రిడ్జిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏకంగా తీగల వంతెనపైకి కారును తీసుకొచ్చి ఆటలు ఆడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిపై నెటిజన్లు భంగ్గుమంటున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని యెల్లపురాలోని శివపుర కేబుల్ బ్రిడ్జి అనేది ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడికి వారాంతర సెలవుల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అలాంటి ఈ బ్రిడ్జిపై మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు యాత్రికులు కారుతో సహా వచ్చేశారు. కారును బ్రిడ్డీ మధ్య వరకు వచ్చారు. కారు బరువు కారణంగా బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని ఆ యువకులను గమనించిన అక్కడి స్థానికులు హెచ్చరించారు. అయినా వాళ్లు వినిపించుకోకుండా స్థానికులతో వాగ్వాదం చేస్తూ కారును బ్రిడ్జీపైకి కొంతదూరం తీసుకొచ్చారు. దీంతో మరికొందరితో కలిసి స్థానికులు గట్టిగా అభ్యంతరం చెప్పడంతో ఆ పర్యాటకులు వెనక్కి తగ్గారు.
అంతేకాక కారును కూడ వెనక్కి తీసుకెళ్లారు. అయితే కారు వెనక్కి వెళ్లే సమయంలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో స్థానికుల సాయంతో కారును ఆ యువకులు వెనక్కి తీసుకెళ్లారు. ఆ విధంగా స్థానికులు బ్రిడ్జీని ప్రమాదం నుంచి తప్పించారు. కాగా, ఈ వంతెనను కేవలం ద్విచక్రవాహనాలు, కాలినడకన వెళ్లే వారి కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ, ఏకంగా కారునే తీసుకురావటం స్థానికంగా దుమారం రేపింది. వంతెన పై నుంచి కారును తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారు వెనుక చాలా మంది పర్యాటకులు ఉన్నట్లు కనిపించారు. కారు వెనక్కి వెళ్లే సమయంలో కూడా వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కనిపించింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవలే గుజరాత్ లోని మోర్బీనగరంలో కేబుల్ బ్రిడ్జీ కూలి వందల మంది ప్రాణాలు గాల్లో కలిపోయిన సంగతి తెలిసి ఇలా చెయ్యడంతో అందరు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లాలో కొందరు పర్యాటకులు చేసిన ఈ పని ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది.
No lessons learnt post #MorbiBridgeCollapse . Hooligans/tourists from Maharashtra were seen driving a car on a suspension bridge at Yellapura town in Uttara Kannada district of Karnataka. Finally the locals ensured that the car was driven back from the bridge in reverse gear. pic.twitter.com/RvVPOhB8CL
— Harish Upadhya (@harishupadhya) November 1, 2022