పెళ్లికి అవసరమైన హంగూ, ఆర్భాటాలు జరుగుతున్నాయి. బ్యాండ్, బాజా హోరెత్తిస్తున్నాయి. దేశీ నెయ్యితో చేసిన వంటలు ఘుమ ఘుమలాడుతున్నాయి. సినిమా పాటలకు అతిధులు నృత్యాలు చేస్తున్నారు. పెళ్లి మండపం కూడా అందంగా ముస్తాబైంది. ముహుర్తం దగ్గర పడుతుండటంతో మంగళ వాయిద్యాలతో పెళ్లి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకు వచ్చారండీ వధూవరులు టామీ, జెల్లీని. ఇదేంటీ శునకాల పేర్లులా ఉన్నాయో అనుకుంటున్నారా? అవునండి.. అది కుక్కల పెళ్లే. ఈ హడావిడి అంతా వాటి పెళ్లికే. ప్రస్తుతం ఈ పెళ్లి వార్త ఆ నోట, ఈ నోట వైరల్ గా మారింది.
ఈ శునకాల వివాహం మకర సంక్రాంతి రోజైన జనవరి 14న అంగరంగ వైభవంగా జరిగిందండోయ్. ఎక్కడా అనుకుంటున్నారా..? ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ జిల్లాలో ఉన్న సుఖ్రవాలి గ్రామంలో. ఈ పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. మేనల్లుడు ఆలోచనను కార్యరూపాన్ని దాల్చాడు అతడి మేనమామ దేవేష్ చౌదరి. తమ వద్ద ఓ మగ కుక్క పిల్ల ఉందని, ఆడ కుక్క పిల్ల అయిన జెల్లీ కోసం తన మామను సంప్రదించి, ఒప్పించామన్నారు. ఈ పెళ్లి తంతు కోసం సుఖ్రవాలి మాజీ గ్రామ పెద్ద, టామీ యజమాని దేవేష్ చౌదరి అన్ని ఏర్పాట్లు చేశారట.
అతిధుల జాబితాను సిద్ధం చేసుకుని, పెళ్లి ముహుర్తం కోసం పంతులను సంప్రదించారట. పెళ్లి రోజు రాగానే.. టామీని అలకరించి, మంగళ వాద్యాలతో, అతిధుల నృత్యాలతో ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువచ్చామని దేవేష్ చౌదరి చెప్పారు. వేద మంత్రాలతో పండితుడు ఈ పెళ్లి తంతును ముగించగా, హోమ గుండం చుట్టూ ప్రదిక్షణలు చేయించారట. పెళ్లికి వచ్చిన అతిధుల కోసం దేశీయ నెయ్యితో చేసిన వంటలను వండించామని, ఈ కుక్కల పెళ్లికి మొత్తం లక్షరూపాయలు ఖర్చు అయిందని దేవేష్ చెప్పారు. అక్కడే ఉన్న వీధి కుక్కలకు కూడా ఆహారం అందించారట. ఈ విచిత్రమైన పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dogs Marriage: अलीगढ़ में कुत्ते की अनोखी शादी, ढोल-नगाड़ों के साथ निकली बारात, नाचे बराती।Quint Hindi
Part 1.1 pic.twitter.com/3S1Otr9dsl
— Adil INC ( Being Human) (@Adil_INC_) January 18, 2023