నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వంతెనపై నుంచి ట్రాక్టర్ నదిలో పడి 15 మంది దుర్మరణం చెందారు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందగా.. పలువురి పరిస్థితి విషయమంగా ఉంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజహాన్ పూర్ జిల్లా థిల్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. వారిలో కూడా పలువురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు సమాచారం. అధిక సంఖ్యలో జనాన్ని తీసుకుని వస్తున్న ట్రాక్టర్ రాటా వంతెనపై నుంచి ఒక్కసారిగా నదిలో పడిపోయింది. దీంతో అందులోని వారు చెల్లాచెదురుగా పడిపోయారు. కొందరు ట్రాక్టర్ కింద పడి మరణించారు. గాయపడిన వారు కాపాడంటూ వేసిన కేకలు ఆకాశానంటాయి.
దీంతో గమనించిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పలువురిని బయటకు తీశారు. అలానే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ప్రమాదానికి గురైన వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ వంతెనపై నుంచి పడిపోయిన సందర్భంలో అక్కడికక్కడే 6 మంది మృతిచెందినట్లు సమాచారం. ఆ తరువాత మరికొందరు మరణించడంతో మృతుల సంఖ్య 15కు చేరింది. కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది. గాయపడిన వారి రోదనలు వింటున్న వారి హృదయాలు గుండె బరువెక్కాయి.
ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. “షాజహాన్‌పూర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి” అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నానని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
जनपद शाहजहांपुर में दुर्घटना में हुई जनहानि अत्यंत दुःखद है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं।
प्रशासनिक अधिकारियों को युद्ध स्तर पर राहत-बचाव कार्य संचालित करने व घायलों के समुचित उपचार हेतु निर्देश दिए हैं।
प्रभु श्री राम से घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना है।
— Yogi Adityanath (@myogiadityanath) April 15, 2023