నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రమైన గాయాలతో జీవితాన్ని ఎంతో వెదన భరితంగా సాగిస్తున్నారు. ఇటీవలే కడప సమీపంలో కారును లారీ ఢీ కొన్ని ఆరుగురు ఓకే కుటుంబానికి చెందిన వారు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడు మంది అక్కడికక్కడే మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మంగళవారం ఉదయం మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని నాగాపూర్-పూణే హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పూణే నుంచి మెహకర్ ప్రాంతానికి ప్రయాణికులతో ఓ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో ఎదురుగా స్పీడ్‌గా వస్తున్న ఓ ట్రక్కు ఆ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సింద్‌కేదార్‌రాజా హాస్పిటల్‌లో చేర్పించారు. రెండు వాహనాలు అతివేగంతో ఉండటంతో బలంగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో రెండు వాహనాలు తునాతునకలయ్యాయి.
బస్సు, ట్రక్కుకు చెందిన గ్లాసు ప్యానల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంతో, మృతదేహాలతో ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందిచారు. దీంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మృతులు కుటుంబాల రోదనలు ఆ ప్రాంతంలో ఆకాశనంటాయి. అలానే క్షతగాత్రుల రోదనలు అందరి హృదయాలను కదలించాయి. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులు వైద్యులకు సూచించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.