పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు నిత్యవసర ధరలు ఆకాశం వైపు చూస్తూంటే.. ఇంధన ధరలు కూడా వీటికి పోటీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మరోసారి కూడా పెరిగాయి. లీటర్ ఇంధనంపై 80 పైసలు చొప్పున పెంచినట్లు ఆయిల్ సంస్థల నోటిఫికేషన్ లో వెల్లడైంది. మార్చి 22 నుంచి ధరలు పెంచడం ప్రారంభమైన తర్వాత ధరలు పెరగడం ఇది 13వ సారి. ఈ ధరల పెంపుతో.. కేవలం ఈ రెండు వారాల వ్యవధిలోనే లీటరుపై రూ.9.20 మేర ధర పెరిగింది.
పెరిగిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.61, డీజిల్ రూ.95.87గా ఉంది. అదే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ లో అయితే లీటరు ధరపై 91 పైసలు మేర పెరిగింది. దీంతో లీటరు పెట్రోల్ రూ.118.59. డీజిల్ ధర 87 పైసలు మేర పెరిగి రూ.104.62కు చేరుకుంది. ఇక విజయవాడ నగర విషయానికి వస్తే.. ఇక్కడ పెట్రోల్ పై 88 పైసలు మేర ధర పెరిగి. రూ.120.66కు చేరింది. డీజిల్ రేటు లీటర్ పై 84 పైసలు పెరిగి రూ.106.29గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. ఇక్కడ లీటరు పెట్రోల్ 84 పైసలు పెరిగి రూ.119.67గా ఉంది. అలాగే లీటరు డీజిల్ రేటు రూ.103.92 పలుకుతోంది. పెరిగిన రేట్లతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది. అయితే ఆయిల్ ధరలు పెరుగుతుండటంపై పార్లమెంట్ సమావేశాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పరుడుతున్నాయి. విపక్ష పార్టీలు ఈ ధరల పెంపుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. మరి.. ఇంధన ధరల పెరుగుదలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.