ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పాడ్డారు. జవాన్లతో వెళ్తున్న మిని బస్సును ఐఈడీ బాంబు పెట్టి పేల్చారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడ జిల్లాలో మందుపాతర పెట్టి మావోయిస్టులు పేల్చారు. నక్సలైట్లు ఐఈడీ బాబు పేల్చడంతో 11 మంది పోలీసులు మృతి చెందారు. మృతులు ఢిపెన్స్ రిసెర్చ్ గ్రూప్ నుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో డీఆర్జీకి చెందిన వారు 10 పోలీసులు కాగా, ఒక డ్రైవర్ మృతి చెందాడు, జవాన్లతో వెళ్తున్న మిని బస్సును మావోయిస్టులు టార్గెట్ చేశారు. పథకం ప్రకారం బస్సు వారి సమీపంలోకి రాగానే మందుపాతరను పేల్చారు. ఈ దీంతో బస్సు ఒక్కసారిగా గాల్లో ఎగిరి కింద పడింది. ఈ ప్రమాదంలో 11మంది డిఫెన్స్ రీసెర్చ్ గ్రూప్ పోలీసులు మృతి చెందారు. గతవారమే పోలీసులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ ఘటనపై ఛత్తీస్ గడ్ సీఎం స్పందించారు.
ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయ్ పూర్ లోని ఆస్పత్రికి తరలించారు. అరన్ పూర్ పరిధిలో పోలీసులు కూంబింగ్‌కు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు ఈ దాడికి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు , ఇతర భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు గాను రాయ్‌పూర్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ఉపయోగించారు. మంగళవారం బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ మాట్లాడుతూ..ప్రతి ఏడాది 400 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు. ఆయన చెప్పిన మరుసటి రోజే ఈ దాడి జరగడంతో భద్రతా దళాలు ఉలిక్కిపడ్డాయి. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దంతెవాడ ప్రాంతంలో డిఫెన్స్ రిసెర్చ్ గ్రూప్ కూంబింగ్ నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. డీఆర్‌జీ లో ఎక్కువగా మావోయిస్టులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన స్థానిక పోలీసులు వుంటారు.