విద్యార్ధుల్లోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన్ని పెంచే వారే గురువు. చెడు మార్గంలో వెళ్లే వారిని సరైన మార్గంలో నడిపించే వారే ఈ గురువులు. అందుకే వారికి సమాజంలో ఎంతో గౌరవ, మర్యాదలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఉపాధ్యాయులను చూసే.. పిల్లలు మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటారు. అయితే కొందరి ఘన కార్యాల వలన గురువు స్థానానికి మాయని మచ్చ తెస్తున్నారు. పిల్లల ముందే అసభ్య వీడియోలు చూడటం, పిల్లల పట్ల అసభ్యం ప్రవర్తిచడం వంటి ఘటనలు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాము. తాజాగా ఓ ఉపాధ్యాయుడు మరో ఘనకార్యం చేసి.. ఆ వృతికే కలంకం తెచ్చాడు. పట్టపగలు తరగతి గదిలో విద్యార్థుల ముందే బీర్ తాగుతూ ఓ టీచర్ అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ డీఆర్ బీ ఇంటర్ కాలేజీలో శైలేంద్ర సింగ్ గౌతమ్ అనే వ్యక్తి అసిస్టెంట్ టీచర్ గా పనిచేస్తున్నాడు. శైలేంద్ర సింగ్ తీరు మొదటి నుంచి వివాదాస్పంగానే ఉంటుంది. గతంలో అతడి పై అనేక ఆరోపణలు వచ్చాయి. సహచర టీచర్ల పట్ల సరిగా ప్రవర్తిండని, క్లాస్ రూమ్ లోకే బీర్లు తెచ్చుకుని తాగుతాడని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో తాజాగా తరగతి గదిలోకి విద్యార్థుల ముందే బీరు తాగాడు. ఎదురుగా పిల్లలు ఉన్నారూ పక్కన మహిళ ఉపాధ్యాయురాలు ఉందనే జ్ఞానం మరచి బిందాస్ గా బీరు తాగాడు. అయితే ఇతడి చేష్టాలతో విసిగిన తోటి సిబ్బంది వీడియో తీశారు. వీడియో తీయవద్దని, అలా చేస్తే బాగుండదని ఈ సందర్భంగా శైలేంద్ర హెచ్చరిస్తున్న మాటలు కూడా ఆ వీడియోలో రికార్డయ్యాయి.
పక్కనే మహిళా టీచర్ కూడా అతడు బీరు తాగుతుంటే ఏమి అనకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. గంటల వ్యవధిలో వేలాది మంది దీన్ని వీక్షించారు. వందల కొద్దీ రీట్వీట్లు వస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన యూపీ రాష్ట్ర ప్రభుత్వం సదరు టీచర్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది.” దేశానికి మంచి పౌరులను అందిచాల్సిన టీచర్లే ఇలా చేస్తే.. ఇంక సమాజం ఎటు పోతుంది?” అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. ఇంకొందరు నెటిజన్లు.. ‘ఏముంది.. ఇప్పుడు సస్పెండ్ చేశారు. కొద్దిరోజులైతే మళ్లీ వచ్చి బడిలో పాఠాలు చెప్తూనే ఉంటాడు. సర్కారి ఉద్యోగులకు ఏమవుతుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు.
नशे की हालत में धुत मास्टर जी बच्चे बच्चियों को पढ़ा रहे हैं। वीडियो हाथरस यूपी की बताई जा रही है। यदि बच्चों के भविष्य के सृजनहार टीचर ऐसी हरकत करें तो क्या बच्चों का भविष्य अच्छा हो सकता है? तुरंत इस टीचर पे कार्यवाही करे @Uppolice pic.twitter.com/zbCoJb5D8e
— Swati Maliwal (@SwatiJaiHind) October 2, 2022