సమాజంలో జరిగే అరాచకాలను అరికడుతూ ప్రజలను రక్షించడం పోలీసుల కర్తవ్యం. సంఘ విద్రోహక శక్తులను అరికట్టే క్రమంలో అప్పుడప్పుడు పోలీసులు తుపాకీలకు కూడా పని చెప్తుంటారు. గన్ ఎలా వినియోగించాలో అనే విషయంలో పోలీసులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఉంటుంది. తుపాకీలను బుల్లెట్లతో లోడ్ చేయడం, వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనే దానిపై పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తుంది. అనంతరం శిక్షణ పొందిన అధికారులను విధుల్లోకి పంపిస్తారు. అలా వెళ్లిన తరువాత కూడా అప్పుడప్పుడు పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. గన్ వినియోగంపై అవగాహన ఉందా? లేదా? అని పరిశీలిస్తుంటారు. అలానే తనిఖీ చేసేందుకు ఓ పోలీస్ స్టేషన్ కు డీఐజీ వెళ్లారు. అక్కడ ఉన్న ఎస్సైని గన్ ఎలా లోడ్ చేయాలో చూపించమని అడిగాడు. ఎస్సై కనీవినీ ఎరుగని తీరిలో తుపాకీలో బుల్లెట్ లోడ్ చేసి డీఐజీ అవాక్కయ్యేలా చేశారు. ఇంతకి ఆ ఎస్సై ఏం చేశాడనే కదా? మీ సందేహం. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్ నగర్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ కు డీఐజీ తనిఖీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరాలకు సంబంధించిన నివేదికలను పరిశీలించారు. అంతేకాక ఆ ప్రాంతంలో నేరాలను అరికట్టేందుకు అక్కడి పోలీసులకు సలహాలు, సూచలను ఇచ్చారు. అలానే తుపాకీ వినియోగంపై అక్కడి పోలీసులకు ఏ మేరకు అవగాహన ఉందో పరిశీలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడి ఎస్సై.. తుపాకి వినియోగంపై తనకున్న అనుభవాన్ని చూపించారు. ఆ ఎస్సై తుపాకీ ముందు భాగం నుంచి బుల్లెట్ లోడ్ చేశారు. అంతేకాకుండా ఎవరికి హానికలగకుండా పేల్చే ప్రయత్నం చేశాడు.
దీంతో ఎస్సై నిర్వాకం చూసిన డీఐజీ .. బుల్లెట్ ఎలా బయటకు తీస్తావు అంటూ ప్రశ్నించారు. దానికి ఆయన సింపుల్ గా తుపాకీ ని వంచడంతో బుల్లెట్లు బయటకు జారి వచ్చాయి. దీంతో డీఐజీతో పాటు అక్కడ ఉన్న అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఎస్సై చేసిన పనికి పక్కనే ఉన్న ఇతర అధికారులు తలలు పట్టుకున్నారు. ఎస్సై చేసిన పనికి ఖంగుతిన్న డీఐజీ.. అక్కడి పోలీసులకు వెంటనే తగిన శిక్షణ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజ్లను ఓ రేంజ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘బుల్లెట్ కే బుర్ర తిరిగేలా చేశావు సార్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.
धन्य है @Uppolice संतकबीरनगर में SI को ये नही पता कि राइफल में गोली कैसे लगती है,नली के रास्ते से ही गोली डाल दिया।DIG आर के भारद्वाज को खलीलाबाद थाने में ये नमूना देखने को मिला।ऐसी ख़ाकी से अपराधी डर के प्रदेश छोड़कर भागने को मजबूर हैं!! वीडियो देखने के बाद हँसी रोकना मुश्किल 🤣 pic.twitter.com/lBVc0aBzIr
— Mamta Tripathi (@MamtaTripathi80) December 27, 2022