నేటికాలంలో మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. కొన్నిరంగాల్లో మగవారి కంటే ఆడవారే ముందున్నారు. మహిళలు ఇంతలా అభివృద్ధి చెందినా కూడా కొందరు తల్లిదండ్రులు మగపిల్లవాడు కావాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా మగబిడ్డ కోసం చాలా మంది మహిళలు తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెడుతుంటారు. అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఓ మహిళ తాజాగా ఓకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చింది. మగపిల్లవాడి కోసం ఎదురుచూస్తున్న ఆ దంపతుల ఆనందానికి అవధులేకుండా పోయాయి. ఈ అద్భుత ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లాకు హీరకేడీ పిండవాల్ ప్రాంతంలో జయంతిలాల్ , బదుదేవి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. స్థానికంగా కూలీ పనుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. బదుదేవి మరోసారి గర్భవతి అయ్యింది. ఈ క్రమంలో నెలలు నిండటంతో నవంబర్ 26న.. సగ్వారాలోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ముగ్గురు మగపిల్లలు బడి జన్మనిచ్చింది. ముగ్గురు పిల్లలు కేవలం కిలో బరువుతో పుట్టారు. ముగ్గురు పసిపిల్లలు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది ఎదురవడంతో కృత్రిమంగా ఆక్సిజన్ అందించారు. దీంతో ఆ పిల్లలు పాలు తాగేందుకు వీలుపడలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది మరో పైపు అమర్చి.. ఆ పసి పిల్లలకు పాలు అందించినట్లు వైద్యులు తెలిపారు.
అయితే తల్లీ బిడ్డలు ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే బదుదేవి విషయం తెలిసిన చుట్టుపక్కల వారు పిల్లలను చూసేందుకు తరలివస్తున్నారు. బదూదేవి.. ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలకు జన్మన్చింది. అయితే కుమారుడు కావాలని కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమె మరో కాన్పు కోసం ఉంచుకున్నట్లు బదూదేవికి చికిత్స అందించిన వైద్యలు తెలిపారు. అయితే ఈ సారి కాన్పులో ఒక మగబిడ్డా కావాలనుకుంటే.. ఏకంగా ముగ్గురు మగ పిల్లలు పుట్టినట్లు తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయన్నారు. ముగ్గురు పిల్లలను ఏడాదిపాటు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, గతంలో అజ్మీర్‌లోనూ ఓ మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్టు వైద్యులు తెలిపారు. మరి.. తాజా సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.