సమాజంలో ఆడవారిపై నిత్యం అనేక దాడులు జరుగుతుంటాయి. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. వారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కామెంట్లు చేస్తుంటారు కొందరు పోకిరిలు. వీరి వేధింపులు తట్టుకోలేక కొందరు మహిళలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తారు. కేసు పెడితే తమను ఏమైన చేస్తారేమో అని భయంతో మరికొందరు పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కరు. అయితే ఇలా భయపడే వారికి కొందరు మహిళలు చేసే పనులు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తున్నాయి. తమను వేధించిన వారికి ఎదురు తిరిగి..వారిని పారిపోయేలా చేస్తుంటారు కొందరు మహిళలు. తాజాగా ఓ యువతి అలాంటి పనే చేసింది. రోడ్డు పై నడుచుకుంటు వెళ్తున్న తనపై అసభ్యకరంగా మాట్లాడిన ఓ వ్యక్తిపై విరుచకపడింది. నడిరోడ్డుపై పడేసి చెప్పుతో పిచ్చకొట్టుడు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర ప్రదేశ్ లోని మొయిరాబాద్ లో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి కామెంట్స్ చేస్తున్నాడు. అలా ఒకటి, రెండు సార్లు వదిలేసింది. దీంతో ఆ వ్యక్తి ప్రవర్తన శృతి మించిపోయింది. ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.దీంతో ఇక ఆవేశం ఆపుకోలేక ఒక్కసారిగా అపరకాళిలా మారి అతడిపై దాడి చేసింది. ఆ రోడ్డుపై వెళ్తున్న వారంత ఒక్కసారిగా చూసి షాక్ అయ్యారు. ఇక ఆ వ్యక్తిని రోడ్డు మీద పడేసి చెప్పుతో ఓ రేంజ్ లో కొట్టింది. ఎంతమంది అడ్డుకున్న ఆ మహిళ ఆగలేదు. కొందరు విడిపించిన..వారిని తప్పించుకుని వెళ్లి మరీ ఆ వ్యక్తిని కొడుతుంది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. అక్కడి చేరుకున్న పోలీసులు వారిద్దర్నీ అడ్డుకుని పోలీస్టేషన్‌కి తరలించారు. ఈ మేరకు పోలీస్ అధికారి అనూప్ సింగ్ సదరు వ్యక్తులను విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
मुरादाबाद
➡महिला ने शोहदे की बीच सड़क जमकर पिटाई की
➡महिला ने शोहदे को बीच सड़क पर चप्पलों से पीटा
➡पिटाई होते देख मौके पर लगी लोगों की काफी भीड़
➡15 मिनट तक शोहदे की पिटाई का हाईवोल्टेज ड्रामा।#Moradabad pic.twitter.com/XxJII5IOS3
— भारत समाचार (@bstvlive) August 27, 2022