నేటికాలంలో ప్రతి ఒక్కరు సంపాదన వేటలో పడి జీవితంలో వచ్చే మధుర క్షణాలను కోల్పోతుంటారు. చాలా మంది డబ్బుతోనే సుఖం ఉందని, అది ఉంటేనే అన్ని రకాల సుఖాలను అనుభవించ వచ్చని భావిస్తుంటారు. కానీ డబ్బుతో కొన్నలేనివిని కొన్ని ఉంటాయని.. అలాంటివి జీవితంలో ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందలేమని కొందరు బలంగా నమ్ముతారు. అలాంటి మధుర క్షణాలను ఆస్వాధించేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధ పడుతుంటారు. తాజాగా పితృత్వాన్ని ఆస్వాదించేందుకు తనకు వచ్చిన వైస్ ప్రెసిడెంట్ పదవినే త్యాగం చేశాడు ఓ తండ్రి. తనకు ఆ పదవుల కంటే పాపే ముఖ్యమని, ఆమె గడిపే క్షణాల్లో పెద్ద సంపాదన అని భావించిన ఆ వ్యక్తి ఎన్నో ఏళ్లు కష్టపడితే వచ్చిన ఫలితాన్ని తృణపాయం వదిలేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివిన అంకిత్ అనే వ్యక్తి ఓ కంపెనీలో చాలా ఏళ్లగా పనిచేస్తున్నాడు. జాబ్ లో అతడి నైపుణ్యం చూసి ఇటీవలే సదరు కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే అంకిత్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో అంకిత్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాపతో గడిపేందుకు తన పదవికి రాజీనామా చేశాడు. తన పాపతో కొంతకాలం హాయిగా గడపాలని నిర్ణయించుకున్నాడు. జీవితంలో ఎదిగే క్రమంలో చిన్న చిన్న సంతోషాలను వదులుకోకూడదని బలంగా భావించాడు. అందుకే అంత పెద్ద ఉద్యోగాన్ని కూడా తృణపాయంగా వదిలేశాడు. ఇక హ్యూమన్స్ ఆఫ్ బాంబే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంకిత్ పలు విషయాలను తెలిపాడు. అంకిత్ మాట్లాడుతూ… “నేను తీసుకున్న నిర్ణయం ఓ అసాధారణమైనది అని నాకు తెలుసు. వైస్ ప్రెసిడెంట్ హోదా పొందేందు ఎన్ని కష్టాలు పడ్డానో కూడా తెలుసు. ఇటీవలే ఆ పదవి నన్ను వరించింది. విధుల్లో భాగంగా పలు నగరాలు తిరగాలి.
ఎక్కువ సెలవులు కూడా ఉండవు. నా చిట్టి తల్లి మా ఇంట్లో కి అడుగుపెట్టాక..తనను మురిపెంగా చూసుకోవాలని భావించాను. దానికి ఈ ఉద్యోగం ఇబ్బంది కలిగిస్తుందని రాజీనామా చేశాను. మా కుటుంబ సభ్యులు చాలా మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నా భార్య మాత్రం నాకు మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం నా పాపతో తెగ ఎంజాయ్ చేస్తోన్నాను. నా చేతుల్లో ఊపుతూ నిద్రపుచ్చడం, తన కోసం లాలిపాటలు వంటి ఎన్నో మధురానుభూతులు సొంతం చేసుకున్నాను. ఇలా పాపతో నెలలు కూడా నాకు రోజుల్లా గడిచిపోయాయి.” అని అంకిత్ తెలిపాడు. ఇక అకింత్ భార్య ఆకాంక్ష కూడా పాపను చూసుకుంటూ మరొక వైపు ఉద్యోగం చేస్తుంది. ఆమెకు కూడా ఇటీవలే పదోన్నతి లభించింది. ఇక అకింత్ చెప్పిన మాటలు ఎంతో మందిని మెప్పించాయి. ప్రస్తుతం విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అకింత్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “పాప కోసం జాబ్ వదిలేశావు. నువ్వు గ్రేట్ సోదరా!” అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.