ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ కొత్త ప్రయాణం లాంటిది. పెళ్లైయిన ప్రతి జంట తమ కొత్త జీవితాన్ని హాయిగా సాగించాలనకుంటుంది. అలానే తాజాగా ఓ యువకుడు నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. తన భాగాస్వామితో కొత్త జీవితాన్ని సంతోషంగా సాగించాలని భావించాడు. అయితే ఆ భర్తకు భార్య దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పెళ్లయిన నెల రోజులకే ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిసింది. దీంతో భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర్ ప్రదేశ్ మహారాజ్ గంజ్ ప్రాంతంలోని ఓ జంటకు నెల రోజుల క్రితం పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగాయి. భార్యభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే ఇటీవల నవ వధువుకు కడుపు నొప్పిగా ఉందని భర్తకు తెలిపింది. దీంతో ఆమెను భర్త కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నవ వధువును పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతిని అని తేలింది. ప్రస్తుతం ఆమెకు నాలుగో నెల అని నిర్ధారించారు. దీంతో భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇదీ చదవండి: ప్రేమించినోడినే పెళ్లి చేసుకుంది.. కానీ భర్త ఇలా చేస్తాడని ఎవరూ ఊహించరు!
తనను మోసం చేశారంటూ భార్య, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. వివాహం జరిగి కేవలం ఒక నెల అయిందని.. మరి నాలుగు నెలల గర్భం ఎలా వస్తుందని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.